Share News

భారత్‌-పాక్‌ మ్యాచ్‌కు ఉగ్రముప్పు!

ABN , Publish Date - May 31 , 2024 | 05:52 AM

టీ20 వరల్డ్‌క్‌పలో క్రికెట్‌ ప్రేమికులంతా అత్యంత ఆసక్తికరంగా ఎదురుచూసేది.. భారత్‌-పాకిస్థాన్‌ జట్ల మధ్య మ్యాచ్‌ కోసమే. అయితే ఇప్పుడా మ్యాచ్‌కు ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉందనే...

భారత్‌-పాక్‌ మ్యాచ్‌కు ఉగ్రముప్పు!

పటిష్ట భద్రతా ఏర్పాట్లు

న్యూయార్క్‌: టీ20 వరల్డ్‌క్‌పలో క్రికెట్‌ ప్రేమికులంతా అత్యంత ఆసక్తికరంగా ఎదురుచూసేది.. భారత్‌-పాకిస్థాన్‌ జట్ల మధ్య మ్యాచ్‌ కోసమే. అయితే ఇప్పుడా మ్యాచ్‌కు ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉందనే సమాచారంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. జూన్‌ 9న జరిగే ఈ మ్యాచ్‌పై డ్రోన్‌లతో దాడులు చేస్తామని ఐసిస్‌-కె ఉగ్రవాద సంస్థ ప్రకటించిన నేపథ్యంలో.. ఆ మ్యాచ్‌కు వేదికైన ఐసెన్‌హోవర్‌ పార్క్‌ స్టేడియానికి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అంతేకాదు.. మ్యాచ్‌ జరిగే రోజు స్టేడియం పరిసరాలను ‘నో ఫ్లయ్‌ జోన్‌’గా ప్రకటించాలని ఫెడరల్‌ ఏవియేషన్‌ ఏజెన్సీని న్యూయార్క్‌ అధికారులు కోరారు. కాగా, ఐసిస్‌-కె ఈ మార్చిలో రష్యా రాజధాని మాస్కోలో దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ‘ఉగ్రముప్పు బెదిరింపులపై స్పష్టత లేదు.


అయినా పటిష్ట చర్యలు తీసుకోవాలని న్యూయార్క్‌ స్టేట్‌పోలీ్‌సకు ఆదేశాలిచ్చాం. మ్యాచ్‌లకు పూర్తి భద్రత ఉండేలా చర్యలు తీసుకున్నాం’ అని న్యూయార్క్‌ గవర్నర్‌ క్యాతీ హోచల్‌ తెలిపారు. మెగా టోర్నీని సురక్షితంగా నిర్వహించేందుకు తాము కూడా చర్యలు తీసుకుంటున్నామని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి స్పష్టం చేసింది. ఇందుకోసం వివిధ అంచెల్లో సెక్యూరిటీని నియమించి, రాష్ట్ర అధికారులతో చర్చలు జరుపుతున్నట్టు స్పష్టం చేసింది.

Updated Date - May 31 , 2024 | 05:52 AM