జాతీయ ఫెన్సింగ్‌లో 3 పతకాలు
ABN , Publish Date - Jun 17 , 2024 | 04:41 AM
జాతీయ ఫెన్సింగ్ పోటీల్లో తెలుగు క్రీడాకారులు సత్తా చాటారు. కటక్‌లో జరిగిన ఈ పోటీల్లో కాకినాడకు చెందిన శ్రీనాగం ప్రద్యుమ్న జగ్గప్పదొర అండర్-10...

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): జాతీయ ఫెన్సింగ్ పోటీల్లో తెలుగు క్రీడాకారులు సత్తా చాటారు. కటక్‌లో జరిగిన ఈ పోటీల్లో కాకినాడకు చెందిన శ్రీనాగం ప్రద్యుమ్న జగ్గప్పదొర అండర్-10 సబ్రే విభాగంలో కాంస్యం అందుకున్నాడు. హైదరాబాద్‌కు చెందిన సిద్ధార్థ్, రియాన్షు అండర్-10 కేటగిరీ ఫాయిల్‌లో సంయుక్తంగా కాంస్య పతకాలు సాధించారు.