Share News

Horoscope: ఈ రాశి వారికి ఏం చేసినా నేడు కలిసొస్తుంది..

ABN , Publish Date - Feb 15 , 2024 | 07:34 AM

ఇవాళ (15-2-2024 - గురువారం) మేషరాశి వారికి ఆర్థికంగా చాలా బాగుంటుంది. అదనపు ఆదాయం సమకూరుతుంది. ఇక వృషభ రాశి వారు అయితే ఏ పనులు చేపట్టినా సక్సెస్ అవుతారు.

Horoscope: ఈ రాశి వారికి ఏం చేసినా నేడు కలిసొస్తుంది..

ఇవాళ (15-2-2024 - గురువారం) మేషరాశి వారికి ఆర్థికంగా చాలా బాగుంటుంది. అదనపు ఆదాయం సమకూరుతుంది. ఇక వృషభ రాశి వారు అయితే ఏ పనులు చేపట్టినా సక్సెస్ అవుతారు. కర్కాటక రాశి వారికి ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. దాదాపు నేడు అన్ని రాశుల వారికి చాలా బాగుంది.

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

వ్యాపారరంగంలోని వారికి అర్థికంగా ప్రోత్సాహకరమైన రోజు. అదనపు ఆదాయం అందుకుంటారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి. డిపాజిట్లపై మంచి ప్రతిఫలం అందుకుంటారు. రుణాలు మంజూరవుతాయి.

వృషభం ( ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

కొత్త ప్రాజెక్టులు చేపట్టేందుకు, చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. పదిమందిలో గౌరవ మన్ననలు అందుకుంటారు. ప్రమోషన్లు కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రముఖులను కలుసుకుంటారు.

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలకు అనుకూలంగా ఉంటుంది. దీర్ఘకాలంగా వాయిదా పడుతున్న పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. ఒక సమాచారం ఉల్లాసం కలిగిస్తుంది. ఆలయాలు, హాస్టళ్లు సందర్శిస్తారు. సేవా కార్యక్రమాలు తృప్తినిస్తాయి.

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. సన్నిహితుల సహకారంతో ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు. వేడుకల్లో పాల్గొంటారు. బ్యాంక్‌ డిపాజిట్లు, పొదుపు పథకాలపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. దత్తాత్రేయ స్వామి ఆరాధన శుభప్రదం.

సింహం ( జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

బృందకార్యక్రమాలు ఉల్లాసం కలిగిస్తాయి. సమావేశాల్లో ప్రముఖులను కలుసుకుంటారు. గౌరవ, ప్రతిష్ఠలు పెంపొందుతాయి. ప్రభుత్వ అధికారుల సహకారంతో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. జనసంబంధాలు విస్తరిస్తాయి.. సాయిబాబా ఆలయాన్ని దర్శించండి.

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

న్యాయ, బోధన, రక్షణ, రవాణా రంగాల వారు శ్రమకు తగిన ఫలితం అందుకుంటారు. ఉద్యోగ, వ్యాపారాల్లో కొత్త వ్యూహాలను అమలు చేసి విజయం సాధిస్తారు. ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాల్లో అంచనాలు ఫలిస్తాయి. సమావేశాలు, విందుల్లో పాల్గొంటారు.

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

ప్రియతముల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆస్పత్రులు, బ్యాంకులు, చిట్‌ఫండ్‌లు, మూచ్యువల్‌ ఫండ్‌ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. గ్రాట్యుటీ, బీమా, పెన్షన్‌ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. సాయి చరిత్ర పారాయణ శుభప్రదం.

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణరంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. భాగస్వామి ఉ ల్లాసం కలిగిస్తుంది. ఇంట్లో వేడుకలకు ఏర్పాట్లు చేస్తారు. స్పెక్యులేషన్లు, పెట్టుబడులపై కుటుంబ సభ్యులతో చర్చిస్తారు. సమావేశాల్లో కీలకపాత్ర పోషిస్తారు.

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించిన కీలక సమాచారం అందుకుంటారు. వ్యవసాయం, పరిశ్రమలు, హోటల్‌, ఆస్పత్రుల రంగాల వారికి అనుకూల సమయం. సహోద్యోగులతో చర్చలు, ప్రయాణాలు ఫలిస్తాయి. విందుల్లో పాల్గొంటారు.

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. చిన్నారులు, ప్రియతముల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిట్‌ఫండ్‌, ప్రకటనలు, కళా రంగాల వారికి అనుకూలమైన రోజు.

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

ఫర్నీచర్‌, నిత్యావసరాలు, హార్డ్‌వేర్‌ వ్యాపారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. గృహనిర్మాణం, స్థల సేకరణ, అద్దె నిర్ణయాల గురించి ఆరాతీస్తారు. కొత్త ఆలోచనలు అ మలు చేసేందుకు అనుకూల సమయం.

మీనం(ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

స్టేషనరీ, రవాణా, ఏజెన్సీలు, మార్కెటింగ్‌ వ్యాపారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యార్థులకు అనుకూలమైన రోజు. విదేశీ ప్రయాణాలు, ఇంటర్వ్యూలకు అవసరమైన పత్రాలు సిద్ధం చేసుకుంటారు. దత్తాత్రేయ స్వామిని ఆరాధించండి.

- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

Updated Date - Feb 15 , 2024 | 07:34 AM