Horoscope: ఈ రాశి వారికి నిధుల లావాదేవీల విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సిందే..
ABN , Publish Date - Jan 29 , 2024 | 07:09 AM
నేడు (29-1-2024 - సోమవారం) మిథున రాశి వారికి గృహనిర్మాణం, స్థల సేకరణకు సంబంధించిన చర్చలకు అనుకూల సమయం. వృషభ రాశి వారికి ఆర్థిక విషయంల్లో చిన్నారుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. కర్కాటక రాశి వారు చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.
నేడు (29-1-2024 - సోమవారం) మిథున రాశి వారికి గృహనిర్మాణం, స్థల సేకరణకు సంబంధించిన చర్చలకు అనుకూల సమయం. వృషభ రాశి వారికి ఆర్థిక విషయంల్లో చిన్నారుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. కర్కాటక రాశి వారు చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. అలాగే నిధుల లావాదేవీల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఇక సింహరాశి వారు ఆర్థిక విషయాల్లో భాగస్వామి వైఖరి మనస్తాపం కలిగిస్తుంది.

మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. ఫార్మా, హోటల్, సేవల రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. సహోద్యోగులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆటంకాలు ఎదురయినా పట్టుదలతో లక్ష్యాలు సాధిస్తారు. రుద్ర కవచ పారాయణ శుభప్రదం.

వృషభం (ఏప్రిల్ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)
పెద్దలుగా మీ బాధ్యతలు నిర్వర్తిస్తారు. విద్యార్థులకు శుభప్రదం. సృజనాత్మక రంగాల వారికి వృత్తి పరంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆర్థిక విషయంల్లో చిన్నారుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. శ్రీ రుద్రకవచ పారాయణ శుభప్రదం.

మిథునం (మే 21-జూన్ 21 మధ్య జన్మించిన వారు)
గృహనిర్మాణం, స్థల సేకరణకు సంబంధించిన చర్చలకు అనుకూల సమయం. అగ్రిమెంట్లకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ప్రయాణాలకు ప్రణాళికలు రూపొందిస్తారు. దూరంలో ఉన్న కుటుంబ సభ్యుల కలయిక లేదా వారి నుంచి వచ్చే సమాచారం ఆనందం కలిగిస్తుంది.

కర్కాటకం (జూన్ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)
విలువైన పత్రాలు అందుకుంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆర్థిక విషయాల్లో తోబుట్టువుల సహకారం లభిస్తుంది. నిధుల లావాదేవీలకు సంబంధించిన చర్చల్లో ఆచితూచి వ్యవహరించాలి. శివారాధన శుభప్రదం.

సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
సన్నిహితుల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక విషయాల్లో భాగస్వామి వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. శివాలయాన్ని దర్శించండి.

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
ఆ రోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. ఫార్మా, హోటల్, సేవల రంగాల వారు లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాల్సి ఉంటుంది. సహోద్యోగులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆహార నియమాలు పాటిస్తారు. యోగధ్యానాలపై దృష్టి పెడతారు.

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
సినిమా, టెలివిజన్ రంగా వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. విదేశీ గమనం, ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలకు కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. ఎగుమతులు, ఫొటోగ్రఫీ, గనులు, ప్రింటింగ్ రంగాల వారికి అనుకూల సమయం. శివారాధన మేలు చేస్తుంది.

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక విషయాల్లో మీ వైఖరిలో మార్పు వస్తుంది. కుటుంబ సభ్యుల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఖర్చులు అంచనాలు మించే అవకాశం ఉంది. బంధుమిత్రుల కలయికతో ఇల్లు సందడిగా ఉంటుంది. శివారాధన శుభప్రదం.

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)
పెద్దలతో చర్చలు, ప్రయాణాలు ఫలిస్తాయి. ఇంటర్వూలలో ఆశించిన ఫలితాలు సాధించలేకపోతారు. వాగ్వివాదాలకు దూరంగా ఉండాలి. విద్యార్థులు పెద్దల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. ప్రభుత్వ రంగ సంస్థల వారికి ఒక సమాచారం కలవరం కలిగిస్తుంది.

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)
ఉన్నత విద్య, విదేశీ ప్రయాణాలకు అెసరమైన నిధులు సర్దుబాటు కావడంతో చిన్నపాటి ఇబ్బందులు ఎదురవుతాయి. ఆర్థిక విషయాల్లో మీ అంచనాలు ఫలించకపోవచ్చు. ప్రయాణాలు, చర్చలు ఫలిస్తాయి. పెట్టుబడులకు సంబంధించిన సమాచారం అందుకుంటారు.

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక విషయాల్లో మీ వైఖరిని సమీక్షించుకోవాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ద చూపించాలి. లక్ష్య సాధనలో గత అనుభవం ఉపయోగపడుతుంది. వడ్డీలు, రుణాలపై ఒక నిర్ణయానికి వస్తారు. పెన్షన్, బీమా వ్యవహారాలకు అనుకూలం.

మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)
సమావేశాలు, వేడుకల్లో పాల్గొంటారు. ఖర్చులు అంచనాలు మించే అవకాశం ఉంది. భాగస్వామి వైఖరి కొంత ఆవేదన కలిగిస్తుంది. ప్రత్యర్థుల నుంచి ఊహించని చిక్కులు ఎదురువుతాయి. కోర్డు వ్యవహారాల్లో జాగ్రత్త తీసుకోవాలి. శివ పంచాక్షరిని జపించండి.
- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ