JP Nadda: తెలంగాణలో నడ్డా పర్యటన.. బీజేపీ నేతలకు దిశానిర్దేశం
ABN, Publish Date - Sep 28 , 2024 | 07:27 PM
తెలంగాణలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఇవాళ(శనివారం) పర్యటించారు. హైదరాబాద్‌లోని హరిత టూరిజం ప్లాజాలో తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశంలో పాల్గొన్నారు. కొత్తగా ఎన్నికైన ఎంపీలు, ఎమ్మెల్యేలకు బీజేపీ జాతీయ అధ్యకుడు నడ్డా దిశానిర్దేశం చేశారు. ప్రజాసమస్యలపై పోరాటం చేయాలని నడ్డా సూచించారు. పార్టీ లైన్ దాటకుండా ఎప్పటికప్పుడు.. అధిష్ఠానం నిర్ణయానికి అనుగుణంగా పనిచేయాలని నడ్డా తెలిపారు. పార్టీలో ఎలాంటి గ్రూప్ రాజకీయాలకు అవకాశం లేదని నడ్డా హెచ్చరించారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నేతలు సమన్వయంతో ముందుకు వెళ్లాలని జేపీ నడ్డా ఆదేశించారు.
1/6
బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డాను సన్మానిస్తున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్
2/6
హరిత టూరిజం ప్లాజాలో జరిగే సమావేశానికి వస్తున్న జేపీ నడ్డా
3/6
బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్న జేపీ నడ్డా
4/6
నడ్డాకు పూల బొకే అందజేస్తున్న మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు
5/6
సమావేశంలో పాల్గొన్న బీజేపీ నాయకులు
6/6
బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డాతో మాట్లాడుతున్న రాజ్యసభ ఎంపీ, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె. లక్ష్మణ్
Updated at - Sep 28 , 2024 | 07:35 PM