Revanth Reddy:రాజన్న సన్నిధిలో రేవంత్
ABN, Publish Date - Nov 21 , 2024 | 08:24 AM
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వరస్వామిని సీఎం హోదాలో రేవంత్‌రెడ్డి బుధవారం దర్శించుకున్నారు. ఉదయం 10.57 గంటలకు రాజన్న ఆలయ గుడిచెరువు వద్ద హెలికాప్టర్ దిగిన ముఖ్యమంత్రి.. నేరుగా ఆలయానికి చేరుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు ఫూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దేవస్థానం ఆవరణలో ధర్మగుండం వద్ద రూ.76 కోట్లతో చేపట్టే ఆలయాభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం దేవాలయ అభివృద్ధి పనులతో ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీని పరిశీలించారు. ఆలయంలో ధ్వజస్తంభం వద్ద కోడెను కట్టి సీఎం రేవంత్‌రెడ్డి మొక్కు చెల్లించుకున్నారు.
Updated at - Nov 22 , 2024 | 02:42 PM