CM Revanth Reddy: హోలీ వేడుకల్లో సీఎం రేవంత్‌రెడ్డి
ABN, Publish Date - Mar 25 , 2024 | 06:29 PM
తెలంగాణలో హోలీ సంబురాలు సోమవారం నాడు ఘనంగా జరిగాయి. హైదరాబాద్‌లోనూ వేడుకలు అంబరాన్నంటాయి. వయసుతో తారతమ్యం లేకుండా అంతా రంగులు చల్లుకుని ఎంజాయ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కుటుంబ సమేతంగా హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. తన మనువడితో కలిసి సరదాగా హోలీ వేడుకలు చేసుకున్నారు. మనువడిపై రంగులు, రంగునీళ్లు చల్లుకుంటూ.. రంగులపండుగను ఆస్వాదించారు. తాతతో బుడి బుడి నడకలు నడుస్తూ చిన్నారి రంగు నీళ్లు పోశాడు. మనువడితో సరదాగా గడుపుతూ ఆ క్షణాలను సీఎం రేవంత్‌రెడ్డి ఆస్వాదించారు.
1/7
కుటుంబ సమేతంగా హోలీ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
2/7
మనువడికి రంగులు పూస్తున్న తాత
3/7
తాతకు రంగులు పూస్తున్న మనువడు
4/7
నవ్వులు చిందిస్తున్న చిన్నారి
5/7
తాత అమ్మమ్మలకు రంగులు పూసేందుకు సిద్ధమవుతున్న మనువడు
6/7
తాత అమ్మమ్మల కోసం రంగులు సిద్ధం చేస్తున్న చిన్నారి
7/7
మనువడిని చూసి మురిసిపోతున్న తాత అమ్మమ్మలు
Updated at - Mar 25 , 2024 | 06:56 PM