Justice Amarnath Goud: త్రిపుర హైకోర్టు న్యాయమూర్తికి అరుదైన రికార్డు
ABN, Publish Date - Nov 17 , 2024 | 10:44 AM
త్రిపుర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అమర్నాథ్ గౌడ్‌కు అరుదైన రికార్డు దక్కింది.. న్యాయమూర్తిగా అత్యధిక కేసులు పరిష్కరించి జస్టిస్ అమర్నాథ్గౌడ్ రికార్డ్ సృష్టించారు..
1/5
తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా ఆయన పురస్కారం అందుకున్నారు.. జస్టిస్ అమర్నాథ్గౌడ్కు యూకే వండర్ బుక్ ఆఫ్ రికార్డ్‌లో చోటు దక్కింది.. 2017 నుంచి ఇప్పటివరకు 92వేల కేసులు పరిష్కరించారు జస్టిస్ అమర్నాథ్ గౌడ్ తెలంగాణలోని హైదరాబాద్‌కు చెందినవారు.
2/5
ఈ సందర్భంగా తన బెంచ్‌లో పెండింగ్ కేసులు లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరిస్తానని జస్టిస్ అమర్నాథ్ గౌడ్ తెలిపారు.
3/5
జస్టిస్ అమర్ నాథ్ గౌడ్ 2017లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడి హైకోర్టుకు న్యాయమూర్తిగా వ్యవహరించారు. 2021 అక్టోబర్ 28న జస్టిస్ అమర్ నాథ్ గౌడ్ త్రిపుర హైకోర్టు జడ్జిగా బదిలీ అయ్యారు.
4/5
నవంబర్ 11, 2022 నుంచి ఏప్రిల్ 16, 2023 వరకు త్రిపుర తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. ఆయన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడి హైకోర్టులో 40 పెండింగ్ కేసులను పరిష్కరించగా.. త్రిపుర హైకోర్టులో 60 శాతం కేసుల్లో తీర్పు వెల్లడించారు.
5/5
జస్టిస్ అమర్ నాథ్ గౌడ్ అత్యధిక కేసులను పరిష్కరించడంపై ఆయనకు పలువురు అభినందనలు తెలిపారు. ఆయన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎదగాలని కోరుకున్నారు. యువత కూడా ఆయన ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలని సూచిస్తున్నారు.
Updated at - Nov 17 , 2024 | 10:45 AM