Share News

Sankranti Festival: టొరంటోలో ఘనంగా సంక్రాంతి పండుగ వేడుకలు

ABN , Publish Date - Jan 19 , 2024 | 10:49 PM

తెలంగాణ కెనడా అసోసియేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి టొరంటో బ్రాంటెన్‌లోని చింగ్కూజీ సెకండరీ స్కూల్‌లో సంక్రాంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో 800కు పైగా ప్రవాస తెలంగాణ వాసులు పాల్గొన్నారు. ఈ వేడుకల్ని కమిటీ కార్యదర్శి శంతన్ నేరళ్లపల్లి ప్రారంభించారు.

Sankranti Festival: టొరంటోలో ఘనంగా సంక్రాంతి పండుగ వేడుకలు

హైదరాబాద్: తెలంగాణ కెనడా అసోసియేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి టొరంటో బ్రాంటెన్‌లోని చింగ్కూజీ సెకండరీ స్కూల్‌లో సంక్రాంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో 800కు పైగా ప్రవాస తెలంగాణ వాసులు పాల్గొన్నారు. ఈ వేడుకల్ని కమిటీ కార్యదర్శి శంతన్ నేరళ్లపల్లి ప్రారంభించారు. మేఘన గుర్రాల, శైలజ ఎర్ర, స్ఫూర్తి కొప్పు, కుమారి ప్రహళిక మ్యాకల, శ్రీరంజని కందూరి తదితరులు జ్యోతి ప్రజ్వలన చేయగా.. శ్రీరామదాసు ఆర్గుల గణేష వందనంతో సంక్రాంతి సంబరాల్ని మొదలుపెట్టారు. తెలంగాణ కెనడా అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆధ్వర్యంలో బోర్డు ఆఫ్ ట్రస్టీ, వ్యవస్థాపక సభ్యుల సహకారంతో ఈ సంబరాల్ని విజయవంతంగా నిర్వహించారు.


ఈ కార్యక్రమంలో 15 సంవత్సరాలలోపు పిల్లలకు ఫ్యాన్సీ డ్రెస్ షో అండ్ టెల్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన చిన్నారుల నృత్యం, భరతనాట్య ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. ఇదే సమయంలో.. వంద మందికి పైగా చిన్నారులకు భోగీ పళ్లు పోసి ఆశీర్వచనాలను అందించారు. ఈ సందర్భంగా.. తెలంగాణ కెనడా అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ మన్నెం మాట్లాడుతూ.. ఇటువంటి కార్యక్రమాలను జరుపుకోవడం ద్వారా తెలంగాణ పండుగలు, సాంప్రదాయాలను భావితరాలకు తెలియజేసి ముందుకు తీసుకువెళ్లడానికి దోహదం చేస్తాయన్నారు.

Updated Date - Jan 19 , 2024 | 10:49 PM