Share News

NRI: కువైత్‌లో ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం

ABN , Publish Date - Jan 21 , 2024 | 05:09 PM

ఎన్నారై టీడీపీ కువైట్ ఆధ్వర్యంలో యన్.టి.ఆర్.ట్రస్ట్ వారి సౌజన్యంతో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కింజరాపు అచ్చన్నాయుడు, ఎన్నారై టీడీపీ ఛైర్మన్ రవి వేమూరు, ఎన్నారై టీడీపీ గల్ఫ్ అధ్యక్షులు రావి రాధాక్రిష్ణ ఆదేశాలు, సూచనలు, సలహాల ప్రకారం అక్కిలి నాగేంద్ర బాబు అధ్యక్షతన కువైట్ సెంట్రల్ బ్లడ్ బ్యాంక్‌లో రక్తదాన కార్యక్రమం జరిగింది.

NRI: కువైత్‌లో ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం

ఎన్నారై డెస్క్: విశ్వవిఖ్యాత, నట సార్వభౌముడు, కోట్లాది జీవితాలలో వెలుగులు నింపిన మహనీయుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత ఎన్టీ రామారావు ఈ భూమ్మీద లేకపోయినా తెలుగు ప్రజల గుండెల్లో బతికే ఉన్నారు. కాబట్టి, ఆయనను ప్రతి తెలుగువాడు స్మరిస్తూ 2024 జనవరి 19 శుక్రవారం ఎన్నారై టీడీపీ కువైట్ ఆధ్వర్యంలో యన్.టి.ఆర్.ట్రస్ట్ వారి సౌజన్యంతో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కింజరాపు అచ్చన్నాయుడు, ఎన్నారై టీడీపీ ఛైర్మన్ రవి వేమూరు, ఎన్నారై టీడీపీ గల్ఫ్ అధ్యక్షులు రావి రాధాక్రిష్ణ ఆదేశాలు, సూచనలు, సలహాల ప్రకారం అక్కిలి నాగేంద్ర బాబు అధ్యక్షతన కువైట్ సెంట్రల్ బ్లడ్ బ్యాంక్‌లో రక్తదాన కార్యక్రమం జరిగింది. ఈ రక్తదాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గల్ఫ్ జనసేన జాతీయ కన్వీనర్ కాంచన శ్రీకాంత్, గల్ఫ్ జనసేన జాతీయ కన్వీనర్ బాణావత్ రామచంద్ర నాయక్, శేఖర్ హాజరయ్యారు.

3.jpg

ఈ రక్తదాన కార్యక్రమానికి ఎన్నారై టీడీపీ కువైట్, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సానుభూతి పరులు తెలుగువారు తండోపతండాలుగా వచ్చి, 87 మంది వరకు రక్తదాతలు రక్తాన్ని దానం చేశారు. రక్తదాతలకు యన్.టి.ఆర్.ట్రస్ట్ వారు అబినంధన పత్రాలను అందచేశారు. తమకు సహాయ సహకారాలు అందించిన డాక్టర్ అస్నా, రక్తదాతలకు యన్.ఆర్.ఐ. టీడీపీ కువైట్, యన్.టి.ఆర్.ట్రస్ట్ తరపున ఎన్నారై టీడీపీ కువైట్ అధ్యక్షులు నాగేంద్ర బాబు అక్కిలి, యన్.ఆర్.ఐ.టీడీపీ కువైట్ టీమ్ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసారు.

2.jpg

అదే విధంగా ఈ సమావేశంలో పాల్గొన్న టీడీపీ ముఖ్య సీనియర్ నాయకులు యనిగల బాలకృష్ణ, పెంచలయ్య నాయుడు, సాయిబాబా దౌర్ల, రమణా యాదవ్ కుర్రా, దొడ్డిపల్లి సుబ్బరాజు, విజయ్ కుమార్ పసుపులేటి, జగదీష్, పిడుగు నరసింహా, సుబ్బయ్య, నరసింహా యాదవ్, చంద్ర శేఖర్ గౌడ్, రియాజ్,షమీర్,ఇలియాజ్, అనవర్,శశికుమార్ రాజు, రాణి చౌదరి, నిర్మలా ముండ్లపాటి, సత్యవతి, రషీదాబేగమ్, ఇందు, అంజలి దేవి పసుపులేటి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి అధ్యక్షులు నాగేంద్ర బాబు అక్కిలి పేరుపేరునా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసారు.

Updated Date - Jan 21 , 2024 | 05:09 PM