Share News

ఒకే నెలలో రెండు సినిమాలు!

ABN , Publish Date - Jan 21 , 2024 | 05:41 AM

బాలీవుడ్‌ నటుడు ఆమిర్‌ఖాన్‌ దూకుడు పెంచారు. ‘లాల్‌ సింగ్‌ చద్దా’ చిత్రం ప్లాప్‌ తర్వాత కొంత కాలం సైలెంట్‌గా ఉన్న ఇప్పుడు ఒకే సారి రెండు చిత్రాలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇవి రెండూ ఫిబ్రవరిలోనే ప్రారంభమవుతుండడం

ఒకే నెలలో రెండు సినిమాలు!

బాలీవుడ్‌ నటుడు ఆమిర్‌ఖాన్‌ దూకుడు పెంచారు. ‘లాల్‌ సింగ్‌ చద్దా’ చిత్రం ప్లాప్‌ తర్వాత కొంత కాలం సైలెంట్‌గా ఉన్న ఇప్పుడు ఒకే సారి రెండు చిత్రాలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇవి రెండూ ఫిబ్రవరిలోనే ప్రారంభమవుతుండడం విశేషం. వీటిల్లో తొలి చిత్రం ‘సితారే జమీన్‌ పర్‌’ ఫిబ్రవరి రెండును ప్రారంభం కానున్నట్లు సమాచారం. జెనీలియా ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తారు. ఈ సినిమా కోసం 70 నుంచి 80 రోజుల వరకూ పని చేయాలని ఆమిర్‌ నిర్ణయించుకున్నారు. ప్రీ ప్రొడక్షన్‌ కోసం చాలా సమయం తీసుకున్న ఆయన చాలా వేగంగా ఈ సినిమాను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారు. ఆర్‌.ఎస్‌. ప్రసన్న ఈ చిత్రానికి దర్శకుడు. ‘ఇక ఆమిర్‌ఖాన్‌ ప్రారంభించే మరో చిత్రం ‘లాహోర్‌.. 1947’. సన్నీ డియోల్‌ ప్రధాన పాత్ర పోషించే ఈ సినిమాకు రాజ్‌కుమార్‌ సంతోషి దర్శకుడు. ఇందులో ఆమిర్‌ అతిధి పాత్ర పోషిస్తారు. ఫిబ్రవరి 12న ప్రారంభమయ్యే ఈ సినిమా కోసం ముంబైలో భారీ సెట్స్‌ వేస్తున్నారు. ఈ రెండింటిలో ‘సితారే జమీన్‌ పర్‌ చిత్రాన్ని క్రిస్మ్‌సకు విడుదల చేయాలని ఆమిర్‌ప్లాన్‌. ‘లాహోర్‌.. 1947’ విడుదల తేదీని ఇంకా నిర్ణయించలేదు.

Updated Date - Jan 21 , 2024 | 05:41 AM