Share News

వ్యాధినిరోధకశక్తి పెరగాలంటే

ABN , Publish Date - Feb 07 , 2024 | 03:42 AM

శరీరంలోని బ్యాక్టీరియా, వైర్‌సలాంటి వాటితో పోరాడాలంటే వ్యాధి నిరోధక శక్తి(ఇమ్యూనిటీ) అవసరం. ఇందుకోసం ఈ చిట్కాలు పాటిస్తే చాలు.

వ్యాధినిరోధకశక్తి పెరగాలంటే

శరీరంలోని బ్యాక్టీరియా, వైర్‌సలాంటి వాటితో పోరాడాలంటే వ్యాధి నిరోధక శక్తి(ఇమ్యూనిటీ) అవసరం. ఇందుకోసం ఈ చిట్కాలు పాటిస్తే చాలు.

  • కాలుష్యం బారిననుంచి తప్పించుకోవాలంటే చేతులు, కాళ్లు శుభ్రం చేసుకున్న తర్వాతనే ఆహార పదార్థాలు తినాలి. ముఖ్యంగా తిండి తినటానికి సరైన సమయం ఏర్పరచుకోవాలి. డైట్‌ పర్ఫెక్ట్‌గా ఉంటేనే జీర్ణ సంబంధ సమస్యలు వచ్చే అవకాశాలు తక్కువ. సరైన డైట్‌ పాటిస్తేనే ఇమ్యూనిటీ పెరుగుతుంది.

  • ఇమ్యూనిటీ ఫుడ్‌ అంటే మాంసాహారం, చేపలు, ఆకు కూరలు, పండ్లు.. ఇవన్నీ తాజాగా ఉంటేనే తినాలి. అప్పుడే శరీరానికి పడుతుంది. తద్వారా ఇమ్యూనిటీ పెరుగుతుంది. ముఖ్యంగా సిట్రస్‌ పండ్లయిన నిమ్మ, ఉసిరి, నారింజలను తినాలి. వీటిలోని విటమిన్‌-సి వల్ల తెల్లరక్తకణాల ఉత్పత్తి పెరుగుతుంది. ఫ్రైడ్‌ఫుడ్‌ను మానేసి నట్స్‌ తినాలి. యాంటీ ఆక్సిడెంట్స్‌ను ఉత్పత్తి చేసే వెల్లుల్లి లాంటి వల్ల వాటి వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది.

  • కచ్చితంగా రోజుకు కనీసం ఆరేడు గంటల నిద్ర ఉండాలి. దీనివల్ల శరీరంలోని తెల్లరక్తకణాల సంఖ్య పెరుగుతుంది. శరీరాన్ని కాపాడగలిగే ఇమ్యూనిటీ మనకు వస్తుంది.

  • ప్రకృతిలో గడపటం వల్ల ఆక్సి జన్‌ అందుతుంది. తద్వారా ఇమ్యూనిటీ పెరుగుతుంది. దీంతో పాటు ఒత్తిడి లేకుండా సంతోషంగా గడపటం వల్ల కూడా శరీరంలో తెలీకుండా ఇమ్యూనిటీ బూస్ట్‌ అవుతుంది. ఎక్కువగా నీళ్లు తాగటం.. తక్కువ చక్కెర తినటం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.

Updated Date - Feb 07 , 2024 | 03:42 AM