Share News

Hair care tips: మీ జుట్టు తెల్లగా ఉందని బాధపడుతున్నారా.. పెరుగును ఇలా వాడితే నల్లటి జుట్టు మీ సొంతం!

ABN , Publish Date - Nov 16 , 2024 | 09:11 AM

ఈ మధ్య కాలంలో చాలా మంది తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారు. ముఖ్యంగా చిన్న వయసులోనే చాలా మంది ఈ సమస్య బారిన పడుతున్నారు. అయితే, పెరుగును ఇలా వాడితే పొడవాటి నల్లటి జుట్టు మీ సొంతం అని నిపుణులు చెబుతున్నారు.

Hair care tips: మీ జుట్టు తెల్లగా ఉందని బాధపడుతున్నారా.. పెరుగును ఇలా వాడితే నల్లటి జుట్టు మీ సొంతం!
White Hair

Hair care tips: జుట్టు ఆకర్షణీయంగా ఉండాలంటే దానిని జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు మీ జుట్టును జాగ్రత్తగా చూసుకోవడం వల్ల మీ వ్యక్తిత్వం పెరుగుతుంది. ఈ మధ్య కాలంలో చాలా మంది తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారు. ముఖ్యంగా చిన్న వయసు నుంచే చాలా మంది ఈ సమస్య బారిన పడుతున్నారు. చుండ్రుతో సహా జుట్టులో అనేక సమస్యలు ఉండటం ఆడవారికి సాధారణ విషయంగా మారింది. అయితే, పెరుగును ఉపయోగించడం వల్ల తెల్లగా ఉన్నగా మీ జుట్టుకు కొత్త జీవం వస్తుంది అని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మీరు పెరుగు సహాయంతో ఈ సమస్యలను సులభంగా వదిలించుకోవచ్చు.

హోం రెమెడీ..

పెరుగును జుట్టుకు ప్రత్యేకంగా ఉపయోగించడం వల్ల కొద్ది రోజుల్లోనే మీరు దాని ప్రభావాన్ని చూడవచ్చు. అందమైన జుట్టు పొందడానికి పెరుగును ఎంత సులభంగా ఉపయోగించవచ్చు. తెల్ల జుట్టుకు పెరుగును మించిన మంచి హోం రెమెడీ లేదు. పెరుగులోని పోషకాలు జుట్టును హైడ్రేట్ చేస్తాయి. శిరోజాలపై బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి. అంతే కాదు, పెరుగు ఒక అద్భుతమైన కొల్లాజెన్, మెలనిన్ బూస్టర్, ఇది సహజంగా జుట్టును నల్లగా చేసి మెరుపునిస్తుంది.

పెరుగు హెయిర్ ప్యాక్..

తెల్ల జుట్టును నల్లగా మార్చేందుకు పెరుగు హెయిర్ ప్యాక్ ఉపయోగపడుతుంది. దీని కోసం, ఒక కప్పు పెరుగులో రెండు చుక్కల నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేసి, 3 నుండి 4 చుక్కల కొబ్బరి నూనె వేసి మూలాల నుండి జుట్టు వరకు అప్లై చేయండి. పెరుగు హెయిర్ ప్యాక్ వేసుకున్న 20 నిమిషాల తర్వాత సాధారణ నీళ్లతో తల స్నానం చేస్తే తెల్లజుట్టు నల్లగా మారుతుంది. దీన్ని రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల జుట్టు మూలాలు బలంగా తయారవుతాయి. అవి పెరగడంతో పాటు జుట్టు పొడవుగా పెరుగుతుంది.

(గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా ఇవ్వబడింది. ABN దీనిని ధృవీకరించలేదు. )

Updated Date - Nov 16 , 2024 | 09:32 AM