Share News

ఇదికూడావ్యాయామమే!

ABN , Publish Date - Feb 13 , 2024 | 12:36 AM

నడకతో ఎన్నో ఆరోగ్య ఫలాలను పొందవచ్చు. నడకతో గుండె వేగం పెరగడంతో పాటు, క్యాలరీలు కూడా ఖర్చవుతాయి.

ఇదికూడావ్యాయామమే!

వ్యాయామం కోసం జిమ్‌కే వెళ్లవలసిన అవసరం లేదు. కొన్ని అలవాట్లను అలవరుచుకోవడం ద్వారా వ్యాయామ ఫలాన్ని పొందవచ్చు.

అవేంటంటే....

నడక: నడకతో ఎన్నో ఆరోగ్య ఫలాలను పొందవచ్చు. నడకతో గుండె వేగం పెరగడంతో పాటు, క్యాలరీలు కూడా ఖర్చవుతాయి. క్రమం తప్పకుండా నడవడం వల్ల అధిక రక్తపోటు అదుపులోకొస్తుంది. అలాగే మధుమేహం, రక్తపోటులు నియంత్రణలో ఉంటాయి. బరువు కూడా

తగ్గుతారు.

డాన్స్‌: ఫిట్‌గా ఉండడం కోసం డాన్స్‌ను కూడా ఎంచుకోవచ్చు. క్యాలరీలు ఖర్చు చేయడానికీ, బరువు తగ్గడానికి ఇదొక అద్భుతమైన ప్రత్యామ్నాయం. డాన్స్‌తో కండరాలు బలపడతాయి, నమ్యత పెరుగుతుంది. సంతులనం, రక్తసరఫరా, మానసికోల్లాసాలు కూడా పెరుగుతాయి.

మెట్లు ఎక్కండి: అదే పనిగా మెట్లు ఎక్కడం కీళ్లకు హానికరమే! కానీ అవకాశం దొరికినప్పుడు చకచకా మెట్లు ఎక్కడానికి సందేహించకండి. మెట్లు ఎక్కడం వల్ల రక్తప్రసరణ పెరుగుతుంది. గుండె వేగం పెరుగుతుంది. కండరాలు బలపడతాయి. బరువు తగ్గుతారు.

క్రీడలు ఆడొచ్చు: బ్యాడ్మింటన్‌, వాలీబాల్‌, సైక్లింగ్‌ లాంటి క్రీడలు కూడా శరీరానికి సరిపడా వ్యాయామాన్ని అందిస్తాయి. ప్రతి రోజూ ఈ క్రీడల్లో పాల్గొనడం వల్ల రక్తంలోని కొలెస్ట్రాల్‌ అదుపులో ఉంటుంది. రక్తపోటు కూడా పెరగకుండా ఉంటుంది. కండరాలు బలపడతాయి. రక్తప్రసరణ పెరిగి శరీరం చురుగ్గా ఉంటుంది.

ఇంట్లోనే వ్యాయామం: ఎక్సర్‌సైట్‌ మ్యాట్‌ నేల మీద వేసుకుని తేలికపాటి వ్యాయామాలు చేయవచ్చు. కార్డియో, బర్పీస్‌ లేదా స్కిప్పింగ్‌ లాంటివి ప్రాక్టీస్‌ చేయవచ్చు. ఫ్లోర్‌ ఎక్సర్‌సైజ్‌ల్లో భాగంగా యాబ్స్‌, క్రంచెస్‌, ప్లాంక్స్‌ లాంటివి చేయవచ్చు. ఇంటి పట్టున వ్యాయామంచేయడం వల్ల జిమ్‌ ఖర్చు, సమయం ఆదా అవుతాయి.

Updated Date - Feb 13 , 2024 | 12:36 AM