Share News

గాడిద గర్వభంగం

ABN , Publish Date - Jan 29 , 2024 | 11:05 PM

అనగనగా ఓ వ్యాపారి. ఆ వ్యాపారి ఇంట్లో ఓ గాడిద, ఓ కుక్క ఉండేది. కుక్కను ప్రేమగా చూడటంతో గాడిదకు అసూయపుట్టేది.

గాడిద గర్వభంగం

అనగనగా ఓ వ్యాపారి. ఆ వ్యాపారి ఇంట్లో ఓ గాడిద, ఓ కుక్క ఉండేది. కుక్కను ప్రేమగా చూడటంతో గాడిదకు అసూయపుట్టేది. అన్నీ తనకే కష్టాలని బాధపడేది. ఆ కష్టాలను ఇతరులకు చెబుతూ ఉపశమనం అయ్యేది. గాడిద కష్టాలని అందుకు అంటారన్నమాట.

ఆ వ్యాపారి మంచి కళాకారుడు కూడా. బొమ్మలు తయారు చేసి రంగులు పూసి మంచి ధరకు అమ్మేవాడు. ఒక రోజు ఓ మంచి బొమ్మను తయారు చేశాడు. పండుగ రోజు ఓ ధనికుడు ఇంటికి తీసుకెళ్లి ఆ బొమ్మను ఇద్దామనుకున్నాడు. ఆ పెద్ద బొమ్మను యథావిధిగా గాడిద మీద తీసుకెళ్లాలనుకున్నాడు. పండగ రోజు ఉదయాన్నే గాడిద మీద బొమ్మను తీసుకుని వ్యాపారి వెళ్తున్నాడు. అరే.. బొమ్మ ఎంత బావుందోనని ఊర్లోని పిల్లా, పెద్దలు చూస్తున్నారు. ఒకటే గుంపు. మెచ్చుకోలు. ఆహా.. ఈ గుంపు ఇలా చప్పట్లు కొడుతుందంటే.. నా గొప్పతనం వల్లనే అనుకుంది. వాస్తవానికి ఆ బొమ్మకు కానీ తన పనికి మెచ్చుకోలని ఆ గాడిదకు తెలీదు.

ఆ ఊరిలోని కొందరు కళాకారులు ఆ బొమ్మచూసి ఆశ్చర్యపోయారు. డ్యాన్సులేశారు. ఆ కళాకారుడు, వ్యాపారి అయిన వ్యక్తికి బహుమతి ఇచ్చారు కొందరు ఆసాములు. ఆ ఆనందం తట్టుకోలేక గాడిద గట్టిగా ఆనందంతో అరవసాగింది. వాస్తవానికి గాడిద అరుపు విని అందరూ బెంబేలెత్తారు. గాడిద మాత్రం తన కంఠ స్వరం గొప్పదన్నట్లు ఒకటే అరుపు. దాన్ని మచ్చికచేసుకుని.. గాండ్రింపు తగ్గించటానికి నానా యాతన పడ్డాడు ఆ వ్యాపారి. చేసేదేమిలేక చివరకి ఒక పెద్ద కర్రను తీసుకుని కాళ్లకు గట్టిగా బాదాడు. కాళ్లకు మంటలు ఒకవైపు.. మరో వైపు గాడిద మెడ తాడును మరో మనిషి పట్టుకున్నాడు. పరిగెత్తితే కొడతారని భయపడి.. మెల్లగా నడిచింది గాడిద. తన గర్వభంగం అలా అణగిపోయింది.

Updated Date - Jan 29 , 2024 | 11:05 PM