Navya : అది అసాధ్యం
ABN , Publish Date - Jun 07 , 2024 | 12:17 AM
మూర్ఖమైన ఆలోచనలు ఉన్నవారిలో పరివర్తన తేవడం ఎంత కష్టమో తన నీతి శతకంలోని ఈ శ్లోకంలో భర్తృహరి వర్ణించాడు.

సుభాషితం
ప్రసహ్యమణి ముద్ధరే న్మకరవక్త్ర దంష్ట్రాన్తరాత్
సముద్ర మపి సంతరే త్ప్రచలదూర్మి మాలాకులమ్
భుజంగమపి కోపితం శిరసి పుష్పవద్ధారయేత్
న తు ప్రతినివిష్ట మూర్ఖ జన చిత్తమారాధయేత్
మూర్ఖమైన ఆలోచనలు ఉన్నవారిలో పరివర్తన తేవడం ఎంత కష్టమో తన నీతి శతకంలోని ఈ శ్లోకంలో భర్తృహరి వర్ణించాడు.
దాని అంతరార్థాన్ని... మకర ముఖాంతరస్థమగు మాణికమున్ బెకిలింపవచ్చు బా/యక చలదూర్మికా నికరమైన మహోదధి దాటవచ్చు మ/స్తకమున బూవుదండవలె సర్పమునైన భరింపవచ్చు మ/చ్చిక ఘటియించి మూర్ఖజన చిత్తము దెల్ప నసాధ్య మేరికిన్... అనే పద్యంతో ఏనుగు లక్ష్మణకవి తెలుగువారికి సమర్పించాడు.
భావం: నేర్పు, ఓర్పు ఉంటే మొసలి నోట్లో ఉన్న మాణిక్యాన్నని సులభంగా తీయవచ్చు. ఎప్పుడూ భయంకరమైన అలలతో ఉద్ధృతంగా ఉండే సముద్రాన్ని దాటవచ్చు. బుసలు కొడుతున్న విషసర్పాన్ని చాకచక్యంగా పట్టుకొని... మెడలో పూల దండలా ధరించవచ్చు. కానీ మూర్ఖుడి మనసు రంజింపజెయ్యడం కుదరని పని. అది ఎంతటి వారికైనా అసాధ్యం.