Share News

టెలిగ్రామ్‌ అప్డేట్స్‌

ABN , Publish Date - May 03 , 2024 | 11:41 PM

టెలిగ్రామ్‌ ఈసారి గుర్తించదగ్గ అప్డేట్‌ను విడుదల చేసింది. ప్రొఫైల్‌ వీక్షణ నుంచి ఎన్‌హ్యాన్స్‌డ్‌ లొకేషన్‌ షేరింగ్‌ వంటివి చాలా సదుపాయాలను ఈ అప్డేట్‌తో రిలీజ్‌ చేసింది.

టెలిగ్రామ్‌ అప్డేట్స్‌

టెలిగ్రామ్‌ ఈసారి గుర్తించదగ్గ అప్డేట్‌ను విడుదల చేసింది. ప్రొఫైల్‌ వీక్షణ నుంచి ఎన్‌హ్యాన్స్‌డ్‌ లొకేషన్‌ షేరింగ్‌ వంటివి చాలా సదుపాయాలను ఈ అప్డేట్‌తో రిలీజ్‌ చేసింది. ఆండ్రాయిడ్‌, ఓఎస్‌ యూజర్ల కోసం సంబంధిత అప్‌డేట్‌ అంటే వెర్షన్‌ 10.11 అందుబాటులో ఉంది.

ప్రొఫైల్‌కు సంబంధించి ఇంతకుమునుపు యాప్‌ పరిధిలోనే ప్రొఫైల్‌ను చూడటానికి తోడు ఎడిట్‌ చేసుకునే వీలు ఉండేది. పర్సనలైజేషన్‌, కంట్రోల్‌కు సంబంధించి అదనపు లేయర్‌ ప్రస్తుత అప్డేట్‌తో కల్పించినట్లయిందని ‘9టు5 గూగుల్‌’ నివేదించింది. మూడు స్టోరీలను పిన్‌ చేసుకోవచ్చు. ఫెస్టివ్‌ ఫ్రొఫైల్‌ను పెట్టుకుని గ్రీటింగ్స్‌ అందుకోవచ్చు.

లొకేషన్‌ షేరింగ్‌ను కూడా స్ట్రీమ్‌లైన్‌లో పెట్టింది. యూజర్‌ తను ఎక్కడ ఉన్నాను అన్న విషయాన్ని కొంతకాలానికి లేదా శాశ్వతంగా తెలియజేసే ఆప్షన్‌ కలుగజేసింది. అలాగే మరొకరు తన లొకేషన్‌కు వస్తున్నప్పుడు అలెర్ట్‌ వచ్చేలా యూజర్‌ ఏర్పాటు చేసుకోవచ్చు.

కస్టమైజ్‌ నోటిఫికేషన్‌ సెట్టింగ్స్‌ వీలు కల్పించింది. స్పందనలు, స్టోరీలకు ఇది అనువుగా ఉంటుంది.

అంటే యూజర్‌ తన అవసరాలకు తగినవిధంగా నోటిఫికేషన్‌ ప్రిఫెరెన్స్‌లు పెట్టుకోవచ్చు. గ్రూప్‌ అడ్మినిస్ట్రేటర్లకు కూడా ఇకపై మరింత సమర్ధంగా పనిచేసుకునే వీలు కల్పించింది. మల్టిపుల్‌ మోడరేషన్‌ చర్యలకు అవకాశం ఇచ్చింది.

ప్రీమియం యూజర్ల కోసం మరికొన్ని ప్రత్యేక ఫీచర్లను తెచ్చింది. వివిధ పోల్స్‌ విషయంలో యానిమేటెడ్‌, కస్టమ్‌ ఎమోజీలు; ప్రకటనలకు తావులేని విధానం తదితరాలు ఇందులో ఉన్నాయి. తమకు మెసేజ్‌లను ఫార్వార్డ్‌ చేసిన వ్యక్తి ప్రొఫైల్‌ ఫొటో కనిపిస్తుంది. డెస్క్‌టాప్‌ యాప్‌లో వెబ్‌సైట్స్‌కు సంబంధించి వ్యూ సపోర్ట్‌ ఇచ్చింది. అలాగే వివిధ చానల్స్‌ యజమానులకు ప్రకటనల ఆదాయాన్ని పంచుకునే వీలూ కల్పించింది.

Updated Date - May 03 , 2024 | 11:41 PM