Share News

స్వెట్‌ ప్రూఫ్‌

ABN , Publish Date - Mar 09 , 2024 | 01:27 AM

మార్నింగ్‌ స్కిన్‌ కేర్‌: వేసవిలో మేకప్‌ కోసం చర్మాన్ని ముందు నుంచీ సిద్ధం చేసుకోవడం కీలకం. అందుకోసం మార్నింగ్‌ స్కిన్‌ కేర్‌ రొటీన్‌ను అనుసరించాలి.

స్వెట్‌ ప్రూఫ్‌

ఎండలు దంచేస్తున్నప్పుడు వేడి, చమట సహజం. ఇలాంటి వాతావరణంలో మందంగా మేకప్‌ వేసుకుంటే అందం కాస్తా అడుగంటిపోతుంది. కాబట్టి చమటతో చెదిరిపోని మేకప్‌ ఇలా వేసుకోవాలి.

మార్నింగ్‌ స్కిన్‌ కేర్‌: వేసవిలో మేకప్‌ కోసం చర్మాన్ని ముందు నుంచీ సిద్ధం చేసుకోవడం కీలకం. అందుకోసం మార్నింగ్‌ స్కిన్‌ కేర్‌ రొటీన్‌ను అనుసరించాలి. సున్నితమైన క్లీన్సర్‌, హైడ్రేటింగ్‌ టోనర్‌, తర్వాత మాయిశ్చరైజర్‌, ఆ పైన 30 ప్లస్‌ ఎస్‌పిఎఫ్‌ కలిగిన సన్‌స్ర్కీన్‌ అప్లై చేసి, ఇవన్నీ చర్మంలో ఇంకిపోయేవరకూ 30 నిమిషాల పాటు ఆగి ఆ తర్వాతే మేకప్‌ మొదలుపెట్టాలి.

స్వెట్‌ ప్రూఫింగ్‌: తేలికగా ఉండే, పోర్‌ మినిమైజింగ్‌ ప్రైమర్‌ను ఈ కాలంలో వాడుకోవాలి. దీంతో ముఖ చర్మం నునుపుగా మారి మేకప్‌ సమంగా పరుచుకుంటుంది. అలాగే మేకప్‌ ఎక్కువ సమయం పాటు చెదిరిపోకుండా ప్రైమర్‌ నియంత్రిస్తుంది.

తక్కువ ఫౌండేషన్‌: హెవీడ్యూటీ కన్‌సీలర్లు, ఫౌండేషన్లు ఈ కాలానికి పనికి రావు. ఇవి కరిగిపోయి, మేక్‌పను పాడు చేస్తాయి. కాబట్టి తేలికపాటి ఫౌండేషన్‌ను ఎంచుకుని, వీలైనంత తక్కువ పరిమాణంలో అప్లై చేసుకోవాలి. లాంగ్‌ వేరింగ్‌, స్వెట్‌ ప్రూఫ్‌ కలిగిన ఫౌండేషన్‌ వేసవికి అనువైనది. లేదంటే ఫౌండేషన్‌కు బదులుగా టింటెడ్‌ మాయిశ్చరైజర్‌ లేదా సిసి క్రీమ్‌ కూడా అప్లై చేసుకోవచ్చు.

పౌడర్‌ ఇలా: చమటకు చెరిగిపోని మ్యాటి పౌడర్‌ను వాడుకోవాలి. వేసవి వేడికి చర్మం పాడవకుండా కాపాడే ఎప్‌పిఎఫ్‌ ఫార్టిఫైడ్‌ మ్యాటి ఫార్ములా పౌడర్‌ను ఎంచుకోవాలి.

వాటర్‌ప్రూఫ్‌: ఐలైనర్‌, మస్కారాలు వాటర్‌ప్రూ్‌ఫవి అయి ఉండాలి.

బ్లాటింగ్‌ పేపర్స్‌: చమటతో మేకప్‌ చెదిరిపోకుండా ఉండడం కోసం బ్లాటింగ్‌ పేపర్స్‌ అందుబాటులో ఉంచుకోవాలి. సాధారణంగా పేపర్‌ టవల్‌, టిష్యూ, న్యాప్కిన్‌లతో ముఖం మీద పట్టే చమటను అద్దుకుంటూ ఉంటారు. కానీ వీటితో ఫౌండేషన్‌ చెదిరిపోయే ప్రమాదం ఎక్కువ.

Updated Date - Mar 09 , 2024 | 01:27 AM