మొలకలు ఇలా కూడా తినొచ్చు
ABN , Publish Date - Jan 23 , 2024 | 03:39 AM
మొలకలతో ఫుడ్ పాయిజనింగ్ జరిగే ఆస్కారాలు ఎక్కువ. తేమతో కూడిన వాతావరణంలో మొలకెత్తుతాయి. కాబట్టి వీటిలో సాల్మనెల్లా, ఇ కొలై సూక్ష్మజీవులు వృద్ధి చెందే అవకాశాలుంటాయి.
మొలకలు కచ్చితంగా పోషక భాండాగారాలే! అయితే వాటిని పచ్చిగానే తినాలా? ఎలా తినడం ఆరోగ్యకరం?
మొలకలతో ఫుడ్ పాయిజనింగ్ జరిగే ఆస్కారాలు ఎక్కువ. తేమతో కూడిన వాతావరణంలో మొలకెత్తుతాయి. కాబట్టి వీటిలో సాల్మనెల్లా, ఇ కొలై సూక్ష్మజీవులు వృద్ధి చెందే అవకాశాలుంటాయి. అలాగే పచ్చి మొలకలను జీర్ణం చేసుకోగలిగే సామర్థ్యం అందరికీ ఉండదు. వీటిని మన శరీరం సంపూర్ణంగా శోషించుకోలేదు. మరీ ముఖ్యంగా బలహీనమైన జీర్ణశక్తి, పేగులు కలిగిన వాళ్లలో కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి, డయేరియా లాంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. ఈ ఇబ్బందులేవీ లేకుండా ఉండాలంటే మొలకలను ఆవిరి మీద ఉడికించి, లేదా ఉడకబెట్టి తినాలి. ఉడికించడం వల్ల వీటిలోని విటమిన్ సిని నష్టపోతాం. అయినప్పటికీ మిగతా పోషకాలన్నీ అంది, మొలకలు పూర్తిగా జీర్ణం కావడం కోసం వాటిని ఉడికించిన తర్వాత తినడమే మేలు. గర్భిణులు, పిల్లలు, పెద్దలు పచ్చి మొకలను తినకపోవడమే శ్రేయస్కరం. వీళ్ల శరీరాలు పచ్చి మొలకల కారక ఫుడ్ పాయిజనింగ్ తాలూకు ప్రభావాలను తట్టుకోలేవు.