PDF : స్మాల్ పీడీఎఫ్
ABN , Publish Date - Feb 03 , 2024 | 05:55 AM
ఈ రోజుల్లో బ్యాంక్ స్టేట్‌మెంట్స్ నుంచి పలు డాక్యుమెంట్లను పీడీఎఫ్ రూపంలో పంపుకోవడం తెలిసిందే. ఆ క్రమంలో పీడీఎఫ్ ఫైల్స్‌ను ఎడిట్,
ఈ రోజుల్లో బ్యాంక్ స్టేట్‌మెంట్స్ నుంచి పలు డాక్యుమెంట్లను పీడీఎఫ్ రూపంలో పంపుకోవడం తెలిసిందే. ఆ క్రమంలో పీడీఎఫ్ ఫైల్స్‌ను ఎడిట్, కన్వర్ట్ చేసేందుకు ఉపయోగపడే యాప్ ఇది. ఇదో ఎఫెక్టివ్ పీడీఎఫ్ టూల్.
దీంతో డాక్యుమెంట్ మేనేజ్‌మెంట్‌ను దీంతో సులువుగా కానిచ్చేయవచ్చు. ఇందులో ఎడిటింగ్ యాప్ పలు ఫీచర్లను అందిస్తోంది. పీడీఎఫ్‌ల ఫైల్స్‌తో తరచూ పనిచేసే వ్యక్తులకు ఇది చాలా బాగా ఉపయోగపడే యాప్ అంటే అతిశయోక్తి కాదు.
ఇది పీడీఎఫ్ ఫైల్స్‌ను వేర్వేరు ఫార్మాట్స్ అంటే మైక్రోసాఫ్ట్ వర్డ్, పవర్‌పాయింట్, ఎక్సెల్ ఫైల్స్‌గా మార్చగలదు. అదేవిధంగా వేరేవాటిని పీడీఎఫ్ ఫైల్స్‌గా మారుస్తుంది. వేర్వేరు పీడీఎఫ్ ఫైల్స్‌ని ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక డాక్యుమెంట్‌గా మార్చగలుగుతుంది.
టెక్స్ట్ నుంచి ఇమేజెస్, షేప్స్ తదితరాలను చేర్చవచ్చు. ఆఖరుకు డిజిటల్ సిగ్నేచర్‌ను సైతం జోడించవచ్చు.
డేటా సేఫ్‌గా ఉంటుంది. దీని మేనేజ్‌మెంట్ కూడా సులువు. అన్ని డాక్యుమెంట్లు, ఫైల్స్‌ని సురక్షితంగా ఒక ప్లేస్‌లో ఉంచుకోవచ్చు. పాస్‌వర్డ్ తదితరాలతో భద్రంగా దాచిపెట్టుకోవచ్చు. డాక్యుమెంట్ల లాకింగ్ అదేవిధంగా షేరింగ్ సులువు.
రొటేట్ స్ప్లిట్, డిలీట్ పేజెస్, ఎక్స్‌ట్రాక్ట్ పేజెస్ తదితర ఎడిటింగ్ టూల్స్ కూడా పీడీఎఫ్‌లకు సంబంధించి ఇందులో ఉన్నాయి. పీడీఎఫ్ సైజ్ తగ్గించుకోవచ్చు. కావాల్సిన సైజ్‌కు తెచ్చుకోవచ్చు.
ఈ యాప్‌ను ఉచితంగా వాడుకోవచ్చు. అడ్వాన్స్‌డ్ ఫీచర్స్ కోసం స్మాల్‌పీడీఎఫ్ ప్రొ లేదా నెలవారీ చందా కలిగిన టీమ్స్ వెర్షన్‌ను ఎంచుకోవాలి.