Share News

రికార్డులు ‘ఎత్తేసింది’

ABN , Publish Date - Apr 14 , 2024 | 03:31 AM

ఈ చిన్నారిని చూస్తున్నారుగా... పేరు అర్షియా గోస్వామి. ఉండేది హరియాణాలోని పంచకుల. వయసు తొమ్మిదేళ్లు. కానీ వెయిట్‌లిఫ్టింగ్‌లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. వయసుకు మించిన బరువులు ఎత్తేసి... అబ్బుర పరుస్తోంది...

రికార్డులు ‘ఎత్తేసింది’

ఈ చిన్నారిని చూస్తున్నారుగా... పేరు అర్షియా గోస్వామి. ఉండేది హరియాణాలోని పంచకుల. వయసు తొమ్మిదేళ్లు. కానీ వెయిట్‌లిఫ్టింగ్‌లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. వయసుకు మించిన బరువులు ఎత్తేసి... అబ్బుర పరుస్తోంది. ఇటీవల 75 కిలోల డెడ్‌లిఫ్ట్‌తో మరో అరుదైన ఘనత సాధించింది. ఈ ఫీట్‌ను వీడియో తీసి ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు ఒకరు. ఇక చెప్పేదేముంది... అర్షియా నైపుణ్యానికి నెటిజనులు ఫిదా అవుతున్నారు. వేల లైక్స్‌తో ఆ చిన్నారిని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. వెయిట్‌లిఫ్టింగ్‌ రికార్డులు అర్షియాకు కొత్తేమీ కాదు. ఆరేళ్ల వయసులో 45 కేజీల డెడ్‌లిఫ్ట్‌ ప్రదర్శించి, ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కురాలిగా ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో చోటు దక్కించుకుంది. అదే ఏడాది 35.8 కేజీల బరువును ఎత్తిన ‘ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో తన పేరు నమోదు చేసుకుంది.

Updated Date - Apr 14 , 2024 | 03:31 AM