Share News

Good food : తృణధాన్యాల్లో ప్రొటీన్‌

ABN , Publish Date - Jul 23 , 2024 | 06:09 AM

తృణధాన్యాలు ఆరోగ్యకరమైన పిండిపదార్థాలు. వీటిలో విటమిన్‌ బి, ఐరన్‌, వృక్షాధారిత మాంసకృత్తుల్లాంటి కీలకమైన పోషకాలుంటాయి. సాధారణంగా మాంసకృత్తులు అనగానే ఎవరికైనా మాంసం, చేపలు గుడ్లే స్ఫురిస్తాయ.

Good food : తృణధాన్యాల్లో ప్రొటీన్‌

తృణధాన్యాలు ఆరోగ్యకరమైన పిండిపదార్థాలు. వీటిలో విటమిన్‌ బి, ఐరన్‌, వృక్షాధారిత మాంసకృత్తుల్లాంటి కీలకమైన పోషకాలుంటాయి. సాధారణంగా మాంసకృత్తులు అనగానే ఎవరికైనా మాంసం, చేపలు గుడ్లే స్ఫురిస్తాయ. కానీ కొన్ని తృణధాన్యాల్లో ఎముకలు, కండరాలను బలపరిచే మేలు రకం మాంసకృత్తులుంటాయి. వాటి గురించి తెలుసుకుందాం!

క్వినోవా

ఈ తృణధాన్యంలో అత్యధిక ప్రొటీన్లుంటాయి. పీచుతో కూడిన ఈ తృణఽధాన్యాన్ని నీళ్లలో ఉడికించి, కూరగాయలతో కలిపి తినొచ్చు. ఆకుకూరల సలాడ్‌ మీద చల్లుకుని తినొచ్చు. లేదాంటే ఓట్‌మీల్‌ మాదిరిగా పాలతో కలిపి, నట్స్‌, సీడ్స్‌, పండ్ల ముక్కలు చల్లుకుని తినొచ్చు. ఒక కప్పు క్వినోవాలో 8 గ్రాముల ప్రొటీన్‌ ఉంటుంది.

అడవి బియ్యం

బ్రౌన్‌, వైల్డ్‌ రైస్‌లో తక్కువ పిండిపదార్థాలు ఎక్కువ పీచు, ప్రొటీన్‌ ఉంటాయి. పర్పుల్‌ బ్లాక్‌ రైస్‌లో బి విటమిన్లు, క్యాల్షియం, పొటాషియం, ఫాస్ఫరస్‌, జింక్‌ కూడా ఉంటాయి. ఈ బియాన్ని ప్రధాన భోజనంలా లంచ్‌, డిన్నర్‌లో తినొచ్చు. ఒక కప్పు వైల్డ్‌ రైస్‌లో ఆరున్నర గ్రాముల ప్రొటీన్‌ ఉంటుంది.

అమరాంథ్‌

తోటకూర విత్తనాలు ప్రధానంగా హృద్రోగాలు, టైప్‌2 మధుమేహులకు ఆరోగ్యకరం. తోటకూర విత్తనాల్లో యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. అలాగే బి విటమిన్లు, కాపర్‌, జింక్‌, మాంగనీస్‌ మొదలైన ఖనిజాలు ఉంటాయి. ఉడికించినప్పుడు మెత్తగా జారుడుగా తయారయ్యే ఈ విత్తనాలను ఓట్స్‌ మాదిరిగా తినొచ్చు. ఒక కప్పు తోటకూర విత్తనాల్లో తొమ్మిది గ్రాముల ప్రొటీన్‌ ఉంటుంది.

Updated Date - Jul 23 , 2024 | 06:09 AM