‘పవర్ స్నాక్స్’!
ABN , Publish Date - Mar 02 , 2024 | 12:49 AM
పోషకాహారం తీసుకుంటున్నా ఒక్కసారిగా నిన్సత్తువ ఆవరిస్తోందా? అయితే అలసటకు లోనుకాకుండా చేసే ఈ ‘పవర్ స్నాక్స్’ ట్రై చేయండి.
పోషకాహారం తీసుకుంటున్నా ఒక్కసారిగా నిన్సత్తువ ఆవరిస్తోందా? అయితే అలసటకు లోనుకాకుండా చేసే ఈ ‘పవర్ స్నాక్స్’ ట్రై చేయండి.
రాగి బిస్కెట్లు
కావలసిన పదార్థాలు:
రాగి పిండి - 1 కప్పు,
యాలకుల పొడి - అర టీస్పూను
సొంఠి - చిటికెడు, గుడ్డు - 1
ఉప్పు - అర చెంచా, రైస్ బ్రాన్, ఆయిల్ - అర కప్పు
తయారీ విధానం:
రాగి పిండి, యాలకుల పొడి బాండీలో వేసి నూనె లేకుండా రెండు నిమిషాలపాటు వేయించాలి.
ఇప్పుడు గుడ్డు, సొంఠి, ఉప్పు వేసి కలపాలి.
చివర్లో నూనె వేసి ముద్దలా కలపాలి.
ఈ ముద్దను చిన్న ఉండలుగా చుట్టి, గుండ్రంగా బిస్కెట్లుగా వత్తుకోవాలి. ఈ బిస్కెట్లను బటర్ పేపర్ వేసిన ట్రేలో పరుచుకోవాలి.
ఓవెన్‌ను ప్రీ హీట్ చేసుకోవాలి.
180 డిగ్రీల దగ్గర 8 నిమిషాలపాటు బేక్ చేసి తీయాలి.
ఖర్జూర లడ్లు
కావలసిన పదార్థాలు:
ఖర్జూరాలు - 1 కప్పు, పచ్చి కొబ్బరి - అర కప్పు
జీడిపప్పు - 1 కప్పు, కొబ్బరి నూనె - రెండు టీస్పూన్లు
తయారీ విధానం:
ఖర్జూరాలను విత్తనాలు తీసి గంటపాటు నీళ్లలో నానబెట్టాలి.
తర్వాత ఆరబెట్టి పక్కనుంచాలి.
జీడిపప్పులో కొబ్బరి కలిపి, బ్లెండ్ వేయాలి.
దీన్లోనే ఖర్జూరాలు, కొబ్బరి నూనె కూడా వేసి మళ్లీ బ్లెండ్ చేయాలి.
ఇలా తయారైన చిక్కని మిశ్రమాన్ని ఉండలు చుట్టాలి.
వీటిని ఫ్రిజ్‌లో చల్లబరిచి పిల్లలకు ఇవ్వాలి.
జొన్న వడ
కావలసిన పదార్థాలు:
జొన్న పిండి - 1 కప్పు
శనగపిండి - అర కప్పు
అల్లం తురుము - అర టీస్పూను
వెల్లుల్లి తరుగు - 1 టీస్పూను
పెరుగు - 1 కప్పు
ఉప్పు, కారం, పసుపు - సరిపడా
నీళ్లు - తగినన్ని
నువ్వులు - 2 టీస్పూన్లు
నూనె - వేపుడుకు సరిపడా
తయారీ విధానం:
పైన చెప్పిన పదార్థాలన్నిటినీ గిన్నెలో వేసి నీళ్లు చేర్చి ముద్దలా కలుపుకోవాలి.
గుండ్రంగా వడలు చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
బాండీలో నూనె పోసి వడలను ఎర్రగా వేయించుకోవాలి.
కొబ్బరి లేదా అల్లం చట్నీతో వేడిగా వడ్డించాలి.
చిరుధాన్యాల్లో ముఖ్యమైనవి జొన్నలు. గ్లూటేన్ లేని సురక్షితమైన పోషకాహారంగా వీటిని పరిగణించవచ్చు. శరీరానికి సరిపడా మాంసకృత్తులు, పీచుపదార్థం జొన్నల ద్వారా పొందవచ్చు. ఒక కప్పు జొన్నల్లో 12 గ్రాముల ఫైబర్ ఉంటుంది. పిల్లలకు రోజుకి అవసరమైన పీచులో ఇది 48%. కాబట్టి జొన్న వడలను మార్నింగ్ లేదా ఈవినింగ్ స్నాక్‌గా పిల్లలకు ఇవ్వాలి. వీటిని ఎలా తయారు చేయాలంటే...
ఖర్జూరంలో విటమిన్ బి6, రాగి, మెగ్నీషియం ఉంటాయి. జీడిపప్పులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఎదిగే పిల్లల బుద్ధి బలానికి ఎంతో అవసరం. కాబట్టి వీటినెలా తయారు చేయాలంటే....