Share News

నొప్పులు తగ్గించే తర్బూజ

ABN , Publish Date - Mar 06 , 2024 | 05:01 AM

తర్బూజ పండులో పోషకాలు అనేకం. ఇందులో పీచుపదార్థం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల కడుపు త్వరగా నిండినట్లు అనిపిస్తుంది. ఇది తిన్నాక ఆకలి వేయదు. నీటిశాతం ఎక్కువే. ముఖ్యంగా ఈ పండులోని

నొప్పులు తగ్గించే తర్బూజ

  • తర్బూజ పండులో పోషకాలు అనేకం. ఇందులో పీచుపదార్థం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల కడుపు త్వరగా నిండినట్లు అనిపిస్తుంది. ఇది తిన్నాక ఆకలి వేయదు. నీటిశాతం ఎక్కువే. ముఖ్యంగా ఈ పండులోని పొటాషియం కొవ్వును తగ్గిస్తుంది. జీర్ణక్రియను సాఫీగా ఉంచుతుంది.

  • తర్బూజ పండు తినటం వల్ల మెదడుకు ఆక్సిజన్‌ సరఫరా పెరుగుతుంది. తద్వారా టెన్షన్‌ తగ్గి నిద్ర పడుతుంది.

  • ఈ జ్యూస్‌ తాగటం వల్ల చక్కెరశాతం పెరగదు. పైగా కిడ్నీలోని రాళ్లు

  • కరిగిపోతాయి.

  • విటమిన్‌ సి,ఎ ఉండటం వల్ల ఇదో అద్భుతమైన ఇమ్యూనిటి బూస్టర్‌లా

  • పని చేస్తుంది. జలుబు, దగ్గులాంటివి దరి చేరవు.

  • కంటికి ఎంతో మేలు చేసే పండు తర్బూజ.

  • బరువు ఎక్కువగా ఉండే వాళ్లు తర్భూను డైట్‌లో ఉంచుకుంటే బరువు

  • తగ్గుతారు. అంతెందుకూ వీటి విత్తనాలు కూడా ఫైబర్‌ను కలిగి ఉండటం వల్ల డీహైడ్రేషన్‌ సమస్యనుంచి కాపాడుతుంది.

  • సాయంత్రం స్నాక్స్‌గా ఎండాకాలం తినొచ్చు. ఈ పండును తింటే

  • రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది. రక్తపోటు లాంటివి కనపడవు.

  • దీనివల్ల గుండె ఆరోగ్యానికి మంచి జరుగుతుంది.

  • తర్బూజ పండు తినటం వల్ల కొల్లాజిన్‌ ఉత్పత్తి జరుగుతుంది.

  • జుట్టు పెరుగుతుంది. ముఖ్యంగా ఈ పండ్లతో ఫేస్‌ప్యాక్‌ వేసుకుంటే చర్మం మృదువుగా ఉంటుంది.

  • యాంటీ ఇన్ఫ్లమేషన్‌ గుణాలు ఇందులో ఉండటం వల్ల కీళ్లు, మోకాళ్లు, చేతి మెడిమలు దగ్గర నొప్పులు వచ్చే అవకాశం తక్కువ.

  • పండు తినని వాళ్లు రసం, సలాడ్స్‌తో తినొచ్చు. ఈ పండు తినటం వల్ల దంతాల నొప్పులు తగ్గిపోతాయి. 2016 అఽధ్యయనం ప్రకారం పంటి నొప్పిని తగ్గించే శక్తి ఈ పండుకు ఉందని పరిశోధకులు తేల్చారు.

  • ఫోలిక్‌ యాసిడ్‌ ఉండటం వల్ల గర్భిణిలు కూడా తినొచ్చు. దీనివల్ల బిడ్డ ఎదగటానికి ఉపయోగపడుతుంది.

Updated Date - Mar 06 , 2024 | 05:01 AM