Share News

కెమెరా హంగులతో ఒప్పో స్మార్ట్‌ఫోన్‌

ABN , Publish Date - Apr 27 , 2024 | 12:16 AM

ఒప్పో - ఔత్సాహిక ఫొటోగ్రాఫర్లను అలరించే చర్యలు తీసుకుంటోంది. ఒప్పో తాజాగా కెమెరా సెంట్రిక్‌ స్మార్ట్‌ ఫోన్‌ ‘ఫైండ్‌ ఎక్స్‌7 అలా్ట్ర’ని చైనాలో విడుదల చేసింది. ఈ ఫోన్‌లో ప్రధాన ఆకర్షణ తొలి

కెమెరా హంగులతో ఒప్పో స్మార్ట్‌ఫోన్‌

ఒప్పో - ఔత్సాహిక ఫొటోగ్రాఫర్లను అలరించే చర్యలు తీసుకుంటోంది. ఒప్పో తాజాగా కెమెరా సెంట్రిక్‌ స్మార్ట్‌ ఫోన్‌ ‘ఫైండ్‌ ఎక్స్‌7 అలా్ట్ర’ని చైనాలో విడుదల చేసింది. ఈ ఫోన్‌లో ప్రధాన ఆకర్షణ తొలి క్వాడ్‌ మెయిన్‌ కెమెరా. హైపర్‌ టోన్‌ ఇమేజెస్‌ ఇంజన్‌తో ఇది వచ్చింది. దీనికి తోడు లెటెస్ట్‌ హార్డ్‌వేర్‌ను దీనిలో ఉంచారు. సెకండ్‌ జనరేషన్‌ సెన్సర్‌ అంటే ఎల్‌వైటీ -506 సెన్సర్‌తో 50ఎంపీ అలా్ట్ర-వైడ్‌ కెమెరా ఇందులో ఉంది. దీంతో ఫొటోగ్రఫీ సామర్థ్యం మరింత మెరుగ్గా ఉంటుంది. రిఫ్లక్షన్‌ను 50 శాతం తగ్గిస్తుంది. 23ఎంఎం ఆప్టికల్‌ ఫోకల్‌ లెంథ్‌ ఉంటుంది. రాత్రనక, పగలనక ఏ సమయంలో అయినా పిక్చర్ల క్లారిటీ బాగుంటుంది. ఇది కాకుండా రెండు పెరిస్కోప్‌ కెమెరాలు కూడా ఉంటాయి. అందులో ఒక దానికి 3ఎక్స్‌ ఆప్టికల్‌ జూమ్‌ ఉంటుంది. 1/1.56 ఇంచీల సోనీ ఐఎంఎక్స్‌ 890 సెన్సర్‌తో ఉంటుంది. క్లోజప్‌, పోర్ట్రయిట్‌లకు సంబంధించి ఇది స్పెషల్‌ ప్రొడక్ట్‌ అని చెప్పవచ్చు. 50ఎంపీ 6ఎక్స్‌ పెరిస్కోప్‌ టెలిఫొటో కెమెరాలో 1/2.5-1 ఇంచీల సోనీ ఐఎంఎక్స్‌ 858 సెన్సర్‌, 135 ఎంఎం ఫోకల్‌ లెంథ్‌ కలిగి ఉంటుంది. 32 ఎంపీ ఫ్రంట్‌ కెమెరాలో ఎల్‌వైటీ -506 సెన్సర్‌ ఉంటుంది. హైపర్‌టోన్‌ ఇమేజ్‌ ఇంజిన్‌, జూమ్‌, హ్యాజల్‌బ్యాండ్‌ పోర్ట్రయిట్‌ మోడ్‌, హ్యాజల్‌బాండ్‌ మాస్టర్‌ మోడ్‌ దీని ప్రత్యేకతలుగా చెప్పవచ్చు.

కే12

ఒప్పో - క్వాల్కామ్‌కు చెందిన స్నాప్‌డ్రాగన్‌ 7జన్‌ 3ఎస్‌ఓసీ పవర్‌తో కె12ని చైనాలో విడుదల చేసింది. 12జీబీ ర్యామ్‌, 512జీబీ వరకు ఆన్‌బోర్డ్‌ స్టోరేజీ సదుపాయం ఉన్నాయి. సెంటర్డ్‌ హోల్‌-పంచ్‌ అమోల్డ్‌ డిస్‌ప్లేకు తోడు డ్యూయల్‌ రేర్‌ కెమెరాలు ఉన్నాయి. 5000ఎంఏహెచ్‌ బ్యాటరీ సపోర్ట్‌ ఉంది. ఇన్‌-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్‌ సెన్సర్‌ ఉంది. ఐపీ54 రేటింగ్‌తో డస్ట్‌ అలాగే స్ప్లాష్‌ రెసిస్టెన్స్‌ ఉంది. బరువు 186 గ్రాములు. క్వింగ్‌యాన్‌, స్టారే నైట్‌ రంగుల్లో లభిస్తున్నాయి. మూడు వేరియంట్లతో ఇవి లభిస్తున్నాయి. 8జీబీ + 256 జీబీ వేరియంట్‌ ఒప్పో కే12 ధర రమారమి ఇండియన్‌ కరెన్సీలో రూ.20,700. 12జీబీ + 256 జీబీ అయితే రూ.23,000, 12జీబీ + 512 జీబీ అయితే రూ.28,700

Updated Date - Apr 27 , 2024 | 05:40 AM