Share News

నడుము నొప్పికి ‘నో’

ABN , Publish Date - Mar 09 , 2024 | 01:29 AM

ఎక్కువ మందిని వేధించే సమస్య వెన్ను నొప్పి. ఎక్కువ సమయాల పాటు కూర్చుని పని చేసే వారిలో, వెన్ను, నడుములోని కండరాల మీద ఒత్తిడి పడడం మూలంగా ఈ సమస్య వేధిస్తూ ఉంటుంది. అయితే ఈ సమస్యను కొన్ని యోగాసనాలతో పరిష్కరించుకోవచ్చు. అవేంటంటే...

సుప్త మత్స్యేంద్రాసనం

శరీరాన్ని మెలితిప్పే ఈ ఆసనంలో, కటి, వెన్ను విప్పారి కండరాలు స్వాంతన పొందుతాయి. ఈ ఆసనం కోసం కాళ్లు చాపి నేల మీద కూర్చోవాలి. ఎడమ కాలిని మడిచి, కుడి కాలి మీదుగా అవతల వైపు నేల మీద ఆనించాలి. నడుము పైభాగాన్ని వెనక్కి తిప్పి, ఎడమ చేతిని వెనక వైపు నుంచి, కుడి చేతిని మోకాలి కింది నుంచి తిప్పి రెండు చేతులూ కలిపి పట్టుకోవాలి. ఈ భంగిమలో 30 సెకన్ల పాటు ఉండాలి.

భుజంగాసనం

వెన్ను, భుజాల్లోని నొప్పిని మటుమాయం చేసే ఆసనమిది. నేల మీద బోర్లా పడుకుని, ముంజేతులు చాపి, మోచేతులు నేల మీద ఆనించి ఉంచాలి. మోచేతుల మీద బరువు మోపుతూ నెమ్మదిగా ఛాతీని పైకి లేపి, ఈ భంగిమలో 30 సెకన్లు ఉండాలి.

ఉష్ట్రాసనం

మోకాళ్ల మీద కూర్చోవాలి. చేతులను నడుము వెనక ఉంచాలి. ఈ భంగిమలో మోచేతులు వెనకవైపుకు తిరిగి ఉండాలి. ఈ భంగిమలో వీలైనంత వెనక్కి వంగాలి. తలను ఆకాశం వైపు తిప్పాలి. ఈ ఆసనంతో నడుము, వెన్నులో బిగదీసిన కండరాలు సడలి, నొప్పులు తగ్గుతాయి.

Updated Date - Mar 09 , 2024 | 01:29 AM