Share News

Navya : ముఖంపై చారలు కనిపించకుండా..

ABN , Publish Date - May 14 , 2024 | 11:58 PM

ఎక్కువ సేపు ఒక వైపు పడుక్కొంటే- ముఖంపై చారలు పడతాయి. ఉదయాన్నే లేచి బయటకు వెళ్లాలంటే ఈ చారలు ఇబ్బందిగా అనిపిస్తాయి. వీటిని చిన్న చిన్న చిట్కాల ద్వారా ఎలా నివారించవచ్చో చూద్దాం

Navya : ముఖంపై చారలు కనిపించకుండా..

క్కువ సేపు ఒక వైపు పడుక్కొంటే- ముఖంపై చారలు పడతాయి. ఉదయాన్నే లేచి బయటకు వెళ్లాలంటే ఈ చారలు ఇబ్బందిగా అనిపిస్తాయి. వీటిని చిన్న చిన్న చిట్కాల ద్వారా ఎలా నివారించవచ్చో చూద్దాం

  • వెల్లకిలా కాకుండా నడుం పరువువైపు ఉండేలా పడుకోవడం అలవాటు చేసుకోవాలి. దీని వల్ల తరగడాపై ముఖం ఒత్తుకుపోదు. దీని వల్ల ముఖంపై చారలు పడవు.

  • చాలా మంది కాటన్‌ గలీబులను వాడతారు. కాటన్‌ కాకుండా శాటిన్‌, సిల్క్‌, మెత్తటి సిల్క్‌ కాటన్‌ గలీబులను వాడితే మంచిది.

  • ప్రతి రోజు పడుక్కొనే ముందు మాయిశ్చరైజర్‌ రాయాలి. దీని వల్ల చర్మం మృదువుగా తయారవుతుంది. ముఖంపై చారలు పడినా అవి వెంటనే తొలగిపోతాయి.

  • ఈ మధ్యకాలంలో రకరకాల షేపుల్లో ఉన్న తలగడాలు వస్తున్నాయి. వీటిని ఉపయోగించటం వల్ల ఒత్తిడి తగ్గుతుంది.

  • నిగనిగలాడే చర్మం కావాలంటే ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవాలి. అప్పుడే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ముఖంపై చారలు ఎక్కువగా కనిపించవు.

Updated Date - May 14 , 2024 | 11:58 PM