Share News

Horoscope Today: ఈ రాశివారికి ఉద్యోగ ప్రయత్నం పక్కాగా సక్సెస్..!

ABN , Publish Date - Feb 26 , 2024 | 07:50 AM

నేడు (26-2-2024 సోమవారం) బంధుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. ఉత్సవాలు, పూజలు మనసుకు సాంత్వన కలిగిస్తాయి. ప్రయాణాలు చర్చలు ఫలిస్తాయి. నూతన భాగస్వామ్యాలకు, కొత్త పనులు ప్రారంభానికి అనుకూల సమయం...

Horoscope Today: ఈ రాశివారికి ఉద్యోగ ప్రయత్నం పక్కాగా సక్సెస్..!

నేడు (26-2-2024 సోమవారం) బంధుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. ఉత్సవాలు, పూజలు మనసుకు సాంత్వన కలిగిస్తాయి. ప్రయాణాలు చర్చలు ఫలిస్తాయి. నూతన భాగస్వామ్యాలకు, కొత్త పనులు ప్రారంభానికి అనుకూల సమయం...

MESHAM-01.jpg

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

ఉద్యోగ, వ్యాపార రంగాల్లో గత అనుభవంతో లక్ష్యాలు సాధిస్తారు. సన్నిహితుల ఆంతరంగిక విషయాల్లో జోక్యం చేసుకోవాల్సి రావచ్చు. దూరప్రాంతాల్లో ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల ఫలిస్తాయి. విరామ కాలక్షేపాలు మనసుకు ఊరటనిస్తాయి.

MESHAM-02.jpg

వృషభం (ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

చిన్నారులు, ప్రియతముల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. శుభకారాల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. మ్యూచ్యువల్‌ ఫండ్స్‌, షేర్‌మార్కెట్‌ లావాదేవీల్లో లాభాలు ఆర్జిస్తారు. సంకల్పం నెరవేరుతుంది.

MESHAM-03.jpg

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

పెద్దలు, పైఅధికారుల వైఖరిలో మార్పు గమనిస్తారు. కుటుంబ విషయాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. గృహారంభ, ప్రవేశాలకు అనుకూలం. తల్లిదండ్రుల విషయాల్లో శుభపరిణామాలు చోటుచేసుకుంటాయి. సంకల్పం నెరవేరుతుంది.

MESHAM-04.jpg

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

రవాణా, ఏజెన్సీలు, స్టేషనరీ, విద్యా రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఒక సమాచారం ఉల్లాసం కలిగిస్తుంది. తోబుట్టువుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. చర్చలు సఫలం అ వుతాయి. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు.

MESHAM-05.jpg

సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. మెడికల్‌ క్లెయిములు మంజూరవుతాయి. పన్నుల వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. బీమా, గ్రాట్యుటీ, పెన్షన్‌ పనులు పూర్తవుతాయి. విలువైన వస్తువుల కొనుగోలు చేస్తారు.

MESHAM-06.jpg

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

భాగస్వామి వ్యవహారాల్లో శుభపరిణామాలు చోటుచేసుకుంటారు. పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు. వివాహ నిర్ణయాలకు అనుకూలం. స్పెక్యులేషన్లలో మంచి లాభాలు గడిస్తారు. జనసంబంధాలు విస్తరిస్తాయి. సంకల్పం నెరవేరుతుంది.

MESHAM-07.jpg

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

దూరప్రాంతాల్లో ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సహోద్యోగులకు సంబంధించిన రహస్య సమాచారం తెలుసుకుంటారు. యోగధ్యానాల ద్వారా ఆరోగ్యం పెంపొందించుకుంటారు. ఉపాథి అ వకాశాలు పెంపొందుతాయి.

MESHAM-08.jpg

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. బృంద కార్యక్రమాల్లో బంధుమిత్రులను కలుసుకుంటారు. క్రీడలు, ఆర్థికరంగాల వారికి సమావేశాలు లాభిస్తాయి. విద్యకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి.

MESHAM-09.jpg

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

తల్లిదండ్రుల విషయాల్లో శుభపరిణామాలు సంభవం. ఉద్యోగంలో మార్పుల కోసం ప్రయత్నిస్తారు. ప్రముఖులను కలుసుకుంటారు. గౌరవ, మర్యాదలు పెంపొందుతాయి. కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. పేరుప్రఖ్యాతులు ఆర్జిస్తారు.

MESHAM-10.jpg

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

విద్యార్థులు ఉత్తమ ఫలితాలు అందుకుంటారు. విద్యాసంస్థల్లో చేరే ప్రయత్నాలు ఫలిస్తాయి. చర్చలు ఫలిస్తాయి. ఒక సమాచారం ఆనందం కలిగిస్తుంది. సన్నిహితులో ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి. సంకల్పం నెరవేరుతుంది.

MESHAM-11.jpg

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. పన్నులు, బీమా, పెన్షన్‌ వ్యవహారాలు పూర్తి చేస్తారు. రుణాలు మంజూరవుతాయి. ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి.

MESHAM-FINAL-12.jpg

మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

భాగస్వామి విషయాల్లో శుభపరిణామాలు సంభవం. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. జనసంబంఽధాలు విస్తరిస్తాయి. కోర్టు వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. స్నేహానుబంధాలు బలపడతాయి. సంకల్పం నెరవేరుతుంది.

- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

Updated Date - Feb 26 , 2024 | 07:58 AM