Share News

Horoscope Today: ఈ రాశుల వారికి గుడ్ న్యూస్.. ఒకసారి చెక్ చేసుకోండి..!

ABN , Publish Date - Feb 25 , 2024 | 07:24 AM

నేడు (25-2-2024 ఆదివారం) బంధుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. ఉత్సవాలు, పూజలు మనసుకు సాంత్వన కలిగిస్తాయి. ప్రయాణాలు చర్చలు ఫలిస్తాయి. నూతన భాగస్వామ్యాలకు, కొత్త పనులు ప్రారంభానికి అనుకూల సమయం...

Horoscope Today: ఈ రాశుల వారికి గుడ్ న్యూస్.. ఒకసారి చెక్ చేసుకోండి..!

నేడు (25-2-2024 ఆదివారం) బంధుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. ఉత్సవాలు, పూజలు మనసుకు సాంత్వన కలిగిస్తాయి. ప్రయాణాలు చర్చలు ఫలిస్తాయి. నూతన భాగస్వామ్యాలకు, కొత్త పనులు ప్రారంభానికి అనుకూల సమయం...

MESHAM-01.jpg

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉపాథి, సేవల రంగాల వారికి ప్రోత్సాహకరం. విందు వినోదాలు, వేడుకల్లో పాల్గొంటారు. వృత్తిపరమైన ప్రయాణాలు, చర్చలు ఫలిస్తాయి. వ్యవసాయం, పరిశ్రమల రంగాల వారు గత అనుభవంతో లక్ష్యాలు సాధిస్తారు.

MESHAM-02.jpg

వృషభం (ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

ప్రేమానుబంధాలు బలపడతాయి. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. చిట్‌ఫండ్‌లు కలిసి వస్తాయి. ఆర్థిక పరిస్థితిపై ప్రియతములతో చర్చిస్తారు. అదనపు ఆదాయం సమకూర్చుకుంటారు. మనసు ఉల్లాసంగా వుంటుంది. ఆదిత్య హృదయ పారాయణ శుభప్రదం.

MESHAM-03.jpg

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

బదిలీలు, మార్పులకు అనుకూలం. అద్దె నిర్ణయం వ్యవహారం ఒక కొలిక్కి వస్తుంది. తల్లిదండ్రుల వైఖరి ఆనందం కలిగిస్తుంది. మీ ఆలోచనలు సమీక్షించుకుంటారు. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. దుర్గామాత ఆలయదర్శనం శుభ ప్రదం.

MESHAM-04.jpg

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

వాహనాల కొనుగోలుకు అనుకూల సమయం. సోదరీసోదరుల విషయాలో శుభపరిణామాలు సంభవం. విలువైన పత్రాలు అందుకుంటారు. బంధుమిత్రులతో ప్రయాణాలు, చర్చలు ఉల్లాసం కలిగిస్తాయి. విదేశీ ప్రయాణాలకు అనుకూలం. రహస్య సమాచారం తెలుసుకుంటారు.

MESHAM-05.jpg

సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరం. షాపింగ్‌ ఉల్లాసం కలిగిస్తుంది. పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. పన్నుల వ్యవహారాలు పరిష్కారం అ వుతాయి. మ్యూచ్యువల్‌ ఫండ్స్‌, షేర్ల లావాదేవీలకు అనుకూల సమయం.

MESHAM-06.jpg

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు. కొత్త పరిచయాలు లాభిస్తాయి. కోర్టు వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. సమావేశాల్లో సత్కారాలు, ప్రశంసలు అందుకుంటారు. ప్రముఖులతో సమావేశాలు లాభిస్తాయి. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు.

MESHAM-07.jpg

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

విదేశీ ప్రయాణాలకు అనుకూలం. గత అనుభవం లక్ష్య సాధనకు తోడ్పడుతుంది. సినిమాలు, ఎగుమతులు, ఫోటోగ్రఫీ, కళా రంగాల వారికి శ్రమ ఫలిస్తుంది. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూరంలో ఉన్న బంధుమిత్రులను కలుసుకుంటారు.

MESHAM-08.jpg

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

వేడుకల్లో బంధుమిత్రులను కలుసుకుంటారు. ఆర్థిక పరిస్థితిని సమీక్షించుకుంటారు. ప్రియతముల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థికపరమైన సమాశాలు ఫలిస్తాయి. వ్యాపారస్తులకు అనుకూలమైన రోజు బ్యాంకులు, ఫైనాన్స్‌ సంస్థల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.

MESHAM-09.jpg

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

వృత్తి, వ్యాపారాల్లో రాణిస్తారు. ప్రభుత్వ సంస్థలతో పనులు పూర్తవుతాయి. బదిలీలు, మార్పుల కోసం చేసే ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో పెద్దల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. ఉన్నత పదవులు అందుకుంటారు.

MESHAM-10.jpg

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

శుభవార్త అందుకుంటారు. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో ప్రయాణాలు ఆనందం కలిగిస్తాయి. వాహనాల కొనుగోలుకు అనుకూలం. రక్షణ, బోధన, న్యాయ, రవాణా, విద్యా రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.

MESHAM-11.jpg

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

పెట్టుబడులు లాభిస్తాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. బీమా, మూచ్యువల్‌ఫండ్స్‌ లావాదేవీలకు అనుకూలం. పొదుపు పథకాలపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. పన్నుల వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. మరమ్మతులకు వెచ్చిస్తారు.

MESHAM-FINAL-12.jpg

మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

కుటుంబ సభ్యుల కోసం సమయం వెచ్చిస్తారు. శ్రీవారు, శ్రీమతి వైఖరిలో మార్పు గమనిస్తారు. కొత్త పరిచయాలు లాభిస్తాయి. మనసు ఉల్లాసంగా వుంటుంది. పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు. న్యాయపరమైన వివాదాలు పరిష్కారం అవుతాయి.

- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

Updated Date - Feb 25 , 2024 | 07:56 AM