Share News

Horoscope: వావ్.. ఈ రాశుల వారికి అన్నీ అదిరిపోయే శుభవార్తలే..!

ABN , Publish Date - Feb 19 , 2024 | 07:40 AM

నేడు (19-2-2024 - సోమవారం) మీ మనసు మార్పును కోరుకుంటుంది. మార్పులు, చేర్పులకు అనుకూలం. దూరంలో ఉన్న ప్రియతముల రాకతో ఇల్లు సందడిగా ఉంటుంది...

Horoscope: వావ్.. ఈ రాశుల వారికి అన్నీ అదిరిపోయే శుభవార్తలే..!

నేడు (19-2-2024 - సోమవారం) మీ మనసు మార్పును కోరుకుంటుంది. మార్పులు, చేర్పులకు అనుకూలం. దూరంలో ఉన్న ప్రియతముల రాకతో ఇల్లు సందడిగా ఉంటుంది.

MESHAM-01.jpg

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

మీ మనసు మార్పును కోరుకుంటుంది. మార్పులు, చేర్పులకు అనుకూలం. దూరంలో ఉన్న ప్రియతముల రాకతో ఇల్లు సందడిగా ఉంటుంది. దూర ప్రయాణాలకు ఏర్పాట్లు చేసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వేడుకల్లో పాల్గొంటారు. శివారాధన శుభప్రదం.

MESHAM-02.jpg

వృషభం ( ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక విషయాల్లో తోబుట్టువులు, సన్నిహితుల సహకారం లభిస్తుంది. చర్చలు, ప్రయాణాలు ఫలిస్తాయి. విలువైన పత్రాలు అందుకుంటారు. సంకల్పం నెరవేరుతుంది. బృందకార్యక్రమాలు అనందం కలిగిస్తాయి. గోమాత సేవ శుభప్రదం.

MESHAM-03.jpg

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక విషయాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. తల్లిదండ్రుల విషయంలో శుభపరిణామాలు సంభవం. రుద్రకవచ పారాయణ శుభప్రదం.

MESHAM-04.jpg

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

చర్చలు, ప్రయాణాలు, వేడుకలు ఉల్లాసం కలిగిస్తాయి. కొత్త వ్యూహాలు అమలు చేసేందుకు తగిన సమయం. న్యాయ, బోధన, రక్షణ, రవాణా రంగాల వారు కొత్త పనులు చేపట్టి విజయం సాధిస్తారు. భవిష్యత్‌ ప్రణాళికలు రూపొందించుకుంటారు.

MESHAM-05.jpg

సింహం ( జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

పూజలు, ఉత్సవాల్లో పాల్గొంటారు. పూర్వ మిత్రులను కలుసుకుంటారు. ఆర్థిక విషయాల్లో ఉత్సాహంగా వుంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. లక్ష్య సాధనలో గత అనుభవం తోడ్పడతుంది. వాయిదా పద్ధతులపై వస్తువులు కొనుగోలు చేస్తారు. శివారాధన శుభప్రదం.

MESHAM-06.jpg

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

శ్రీవారు, శ్రీమతి వ్యవహారాలు ఉల్లాసం కలిగిస్తాయి. విందు వినోదాలు, వేడుకల్లో పాల్గొంటారు. బృంద కార్యాక్రమాల్లో కీలకపాత్ర పోషిస్తారు. జనసంబంఽధాలు విస్తరిస్తాయు. ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. పరమశివుని ఆరాధన శుభప్రదం.

MESHAM-07.jpg

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వైద్యం, వ్యవసాయం, పరిశ్రమలు, హోటల్‌, కేటరింగ్‌ రంగాల వారికి ప్రోత్సాహకరం. బంధు మిత్రులతో వేడుకలు, విందు వినోదాల్లో పాల్గొంటారు. సంకల్పం నెరవేరుతుంది. రుద్ర కవచ పారాయణ శుభప్రదం.

MESHAM-08.jpg

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

ప్రియతములు, చిన్నారుల వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. షాపింగ్‌లో విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. మీలోని ప్రతిభ కు గుర్తింపు లభిస్తుంది. పొదుపు పథకాల గురించి ఆరాతీస్తారు. వేడుకల్లో పాల్గొంటారు. శివారాధన శుభఫలితాలను ఇస్తుంది.

MESHAM-09.jpg

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

వేడుకలకు ఏర్పాట్లు చేస్తారు. బంధువుల రాకతో ఇల్లు సందడిగా వుంటుంది. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారికి ప్రోత్సాహకరం. బదిలీలు, మార్పుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. గోమాతను సేవించండి.

MESHAM-10.jpg

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

శ్రీవారు, శ్రీమతి వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. ప్రియతములో చర్చలు ప్రయాణాలకు అనుకూల సమయం. శుభవార్త అందుకుంటారు. సన్నిహితుల నుంచి మెయిల్స్‌, ఫోన్‌ సందేశాలు అందుకుంటారు. వాహనాల కొనుగోలుకు అనుకూలం.

MESHAM-11.jpg

కుంభం (జనవరి 21 నుంచి ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

విందు వినోదాలు ఆనందం కలిగిస్తాయి. అదనపు ఆదాయం సమకూరుతుంది. వ్యవసాయం, పరిశ్రమల రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో సన్నిహితుల సహకారం లభిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

MESHAM-FINAL-12.jpg

మీనం(ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

కొత్త పనులు ప్రారంభిస్తారు. వేడుకల్లో పాల్గొంటారు. సంకల్పం నెరవేరుతుంది. వ్యక్తిగత వ్యవహారాలకు సంబంధించిన ఆలోచనలు ఒక కొలిక్కి వస్తాయి. కొత్త వ్యక్తుల్ని కలుసుకుంటారు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవం.

- శ్రీ బిజుమళ్ల బిందుమాధవ శర్మ సిద్ధాంతి

Updated Date - Feb 19 , 2024 | 07:40 AM