Share News

పాత చీరలతో కొత్త డ్రస్సులు

ABN , Publish Date - Mar 27 , 2024 | 05:28 AM

వేలకు వేలు పోసి కొన్ని ఖరీదైన చీరలు ఫ్యాషన్‌కు కాలం చెల్లి, బీరవాలకే పరిమితమైపోతూ ఉంటాయి. మహిళలందరూ ఎదుర్కొనే బాధే ఇది. అయితే వాటిని కట్టుకోలేకపోతున్నామని బాధ పడకుండా, ఇదిగో పాత చీరలతో కొత్త డ్రస్సులు కుట్టించుకోండి.’

పాత చీరలతో కొత్త డ్రస్సులు

వేలకు వేలు పోసి కొన్ని ఖరీదైన చీరలు ఫ్యాషన్‌కు కాలం చెల్లి, బీరవాలకే పరిమితమైపోతూ ఉంటాయి. మహిళలందరూ ఎదుర్కొనే బాధే ఇది. అయితే వాటిని కట్టుకోలేకపోతున్నామని బాధ పడకుండా, ఇదిగో పాత చీరలతో కొత్త డ్రస్సులు కుట్టించుకోండి.’

శారీ డ్రస్‌

అటు చీరనూ, ఇటు డ్రస్సునూ తలపించే శారీ డ్రస్‌ లేటెస్ట్‌ ఫ్యాషన్‌. చీర లుక్‌ చెదరకుండా ఆధునికత ఉట్టిపడేలా ఇలా శారీ డ్రస్‌ కుట్టించుకుంటే ఈవినింగ్‌ పార్టీల్లో రెట్టింపు మోడర్న్‌గా కనిపించవచ్చు. సింథటిక్‌, కాటన్‌ చీరలను ఈ శారీ డ్రస్‌గా ఎంచుకోవచ్చు.

శారీ గౌన్‌

నారాయణ్‌పేట్‌ శారీలతో లాంగ్‌ అండ్‌ షార్ట్‌ గౌన్స్‌ కుట్టించుకోవడం ఇప్పుడు ఫ్యాషన్‌గా మారింది. జరీ అంచున్న చీరలను ఇందుకోసం ఎంచుకోవాలి. చేతులు, గౌను అంచులకు, ఛాతీ దగ్గర జరీ డిజైన్‌ వచ్చేలా కుట్టించుకోవాలి. సంప్రదాయ వేడుకల్లో ధరించడానికి ఈ కాటన్‌ శారీ గౌన్లు చాలా బాగుంటాయి.

వెల్వెట్‌ గౌన్‌

వెల్వెట్‌ మెటీరియల్‌ ఫ్యాన్సీ చీరలతో మోడర్స్‌ డ్రస్‌లు కుట్టించుకోవచ్చు. రబ్బర్‌ సిల్క్‌ మెటీరియల్‌ కూడా ఈ డ్రస్‌లకు చక్కగా నప్పుతుంది. కుచ్చులు, సెక్విన్లు, డోరీలు జోడిస్తే వెల్వెట్‌ గౌన్లతో ఆధునికంగా కనిపించవచ్చు. సింపుల్‌ జ్యువెలరీ, హైహీల్స్‌ జోడించి మరింత రిచ్‌ లుక్‌ తెప్పించవచ్చు.

Updated Date - Mar 27 , 2024 | 05:28 AM