NAVYA : మే 16న ఇండియాలోకి మోటోరోల ఎడ్జ్ 50 ఫ్యూజన్
ABN , Publish Date - May 11 , 2024 | 12:56 AM
మోటోరోల ఎడ్జ్ 50 ఫ్యూజన్ మే 16న ఇండియాలో విడుదల అవుతోంది. గత నెలలోనే ఇది ఎంపిక చేసిన యూరప్ మార్కెట్లలోకి వచ్చింది.
మోటోరోల ఎడ్జ్ 50 ఫ్యూజన్ మే 16న ఇండియాలో విడుదల అవుతోంది. గత నెలలోనే ఇది ఎంపిక చేసిన యూరప్ మార్కెట్లలోకి వచ్చింది. తాజాగా భారతదేశంలోకి ప్రవేశిస్తోంది. 144హెచ్‌జెడ్ రిఫ్రష్ రేటు డిస్‌ప్లే, ఐపీ68 రేటు, 50 మెగా పిక్సెల్ డ్యూయల్ రేర్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ 68 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.
ఆన్‌బోర్డ్ ర్యామ్ 12 జీబీ. 1600 నిట్స్ మేర్ పీక్ బ్రైట్‌నెస్, కార్నింగ్ గొరెల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉన్నాయి. ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సర్ ఉంది. ఫారెస్ట్ బ్లూ, హాట్ పింక్, మార్షమల్లో బ్లూ రంగుల్లో ఇది లభ్యమవుతుంది. యూరప్‌లో దీని ధర మన ఇండియన్ కరెన్సీలో రూ.35,900.