Share News

Lovely raincoats : లవ్లీ రెయిన్‌కోట్స్‌

ABN , Publish Date - Jun 12 , 2024 | 03:56 AM

వర్షాకాలం వేసుకునే రెయిన్‌ కోట్స్‌ ఆకర్షణీయమైన రంగుల్లో, అందమైన మోడళ్లలో తయారవుతున్నాయి. వేసుకునే దుస్తులకు తగ్గట్టు రకరకాల

Lovely raincoats : లవ్లీ రెయిన్‌కోట్స్‌

వర్షాకాలం వేసుకునే రెయిన్‌ కోట్స్‌ ఆకర్షణీయమైన రంగుల్లో, అందమైన మోడళ్లలో తయారవుతున్నాయి. వేసుకునే దుస్తులకు తగ్గట్టు రకరకాల మోడల్స్‌లో దొరుకుతున్న రెయిన్‌ కోట్స్‌ మీద ఓ లుక్కేద్దామా?

పాంచో రెయిన్‌కోట్‌: ఈ రెయిన్‌కోట్‌ ప్లాస్టిక్‌తో తయారవుతుంది. తేలికగా ఉండే ఈ రెయిన్‌కోట్‌ను సునాయాసంగా మడత పెట్టేసి, వెంట తీసుకెళ్లిపోవచ్చు.

పాకెట్‌ రెయిన్‌కోట్‌: రెయిన్‌కోట్‌ కోసం ప్రత్యేకమైన సంచిని కేటాయించ లేనివాళ్లు, ఉపయోగించని సమయాల్లో దాన్ని భద్రంగా దాచాలనుకునేవాళ్లకు అనువైన రెయిన్‌ కోట్‌ ఇది. లైట్‌ వెయిట్‌, రీయూజబుల్‌ మెటీరియల్‌తో తయారయ్యే ఈ రెయిన్‌కోట్‌ను చిన్నపాటి పౌచ్‌లో, లేదా జేబులో దాచేయవచ్చు.

వాటర్‌ ప్రూఫ్‌ రెయిన్‌కోట్‌: వాటర్‌ప్రూఫ్‌ రెయిన్‌కోట్స్‌, వాటర్‌ రిపెల్లెంట్‌ రెయిన్‌కోట్స్‌ కంటే మంచివి. వాటర్‌ రిపెల్లెంట్‌ రెయిన్‌ కోట్స్‌ తయారీలో నీటిని అంటుకోనివ్వకుండా చేసే రసాయనాలను ఉపయోగిస్తారు. కాబట్టి వాటర్‌ ప్రూఫ్‌ తరహా రెయిన్‌కోట్స్‌నే ఎంచుకోవాలి.

క్రీ.శ 1200వ శతాబ్దంలో అమేజాన్‌ ప్రాంతాల్లో మొట్టమొదటిసారిగా రెయిన్‌కోట్స్‌ను ఉపయోగించిన చారిత్రక ఆధారాలున్నాయి. పాలను పోలిన జిగట పదార్థంతో (రబ్బర్‌ చెట్ల జిగురు) అప్పట్లో రెయిన్‌కోట్లను తయారుచేసేవారు. యూరోపియన్లు, అన్వేషకులు, అమెరికాస్‌కు ప్రయాణించినప్పుడు, వాన నీళ్లకు తడిచిపోకుండా కాపాడే ఈ రెయిన్‌కోట్లను వాళ్లు కనుగొన్నారు. అమేజాన్‌ ప్రాంత ప్రజలు రబ్బరు పాలతో రెయిన్‌కోట్లను తయారుచేసుకున్న విధానాన్ని, యూరోపియన్లు, 1700 శతాబ్దంలో కనిపెట్టగలిగారు. అలా అప్పటి నుంచి మెరుగైన రెయిన్‌కోట్ల తయారీ పరిశోధనలు మొదలయ్యాయి. 1824లో, స్కాట్‌ల్యాండ్‌ కెమిస్ట్‌, మొట్టమొదటి ఆధునిక రెయిన్‌కోట్‌ను తయారుచేశాడు. దాని తయారీకి ఉపయోగించిన టార్పాలిన్‌ వస్త్రాన్ని, ఇండియన్‌ రబ్బర్‌ క్లాత్‌ అని అతను సంబోధించేవాడు. అలా అప్పటి నుంచి రెయిన్‌కోట్లు ఎన్నో మార్పులకు గురవుతూ, ఫ్యాషన్‌ ప్రపంచంలో సైతం ఉనికిని చాటుకోగలిగే స్థాయికి ఎదిగాయి.

Updated Date - Jun 13 , 2024 | 04:24 AM