Share News

మచ్చ లేని చంద్రబింబంలా..

ABN , Publish Date - Mar 31 , 2024 | 05:28 AM

ముఖం మీది మొటిమల మచ్చలను మేకప్‌తో దాచేయడం కూడా ఒక కళే! ఆ కళ మీద పట్టు సాధించాలంటే ఆ మచ్చలు చర్మంలో కలిసిపోయేలా కొన్ని మేకప్‌ టిప్స్‌ పాటించాలి.

మచ్చ లేని చంద్రబింబంలా..

.

ముఖం మీది మొటిమల మచ్చలను మేకప్‌తో దాచేయడం కూడా ఒక కళే! ఆ కళ మీద పట్టు సాధించాలంటే ఆ మచ్చలు చర్మంలో కలిసిపోయేలా కొన్ని మేకప్‌ టిప్స్‌ పాటించాలి.

ముఖం శుభ్రం: మేకప్‌ చర్మం మీద సమంగా అంటుకోవాలంటే, మొదట ముఖాన్ని శుభ్రంగా కడిగి, మాయిశ్చరైజర్‌ అప్లై చేయాలి. జిడ్డు చర్మం కలిగిన వాళ్లు మాయిశ్చరైజర్‌ అప్లై చేయకూడదు.

ప్రైమర్‌: స్కిన్‌ కేర్‌ రొటీన్‌ తర్వాత, మేకప్‌కు ముందు అనుసరించ వలసిన స్టెప్‌ ఇది. మేకప్‌ ఉత్పత్తులు చర్మంలోకి ఇంకిపోకుండా ప్రైమర్‌ తోడ్పడుతుంది. హెచ్చుతగ్గులు లేకుండా మేకప్‌ చర్మం మీద పరుచుకోవడానికి వీలుగా, ప్రైమర్‌ చర్మాన్ని సిద్ధం చేస్తుంది.

మచ్చలను ఇలా దాచేయవచ్చు: మచ్చల మీద ఆకుపచ్చని కరెక్టర్‌ అంటించి, కన్‌సీలర్‌ను వాటి మీద అద్దాలి. ఇలా చేయడం వల్ల మచ్చ నలుపు రంగు తగ్గి, చర్మంలో కలిసిపోతుంది. మచ్చ మరీ నల్లగా లేకపోతే, నేరుగా కన్‌సీలర్‌నే అద్దవచ్చు. అయితే కన్‌సీలర్‌ను మచ్చ మీద అద్దాలే తప్ప, రుద్దకూడదు. పాటెడ్‌ కన్‌సీలర్‌ను కాటన్‌ స్వాబ్‌తో అద్దడం మేలు.

లిక్విడ్‌ ఫౌండేషన్‌: స్టిప్లింగ్‌ బ్రష్‌ లేదా మేకప్‌ స్పాంజ్‌తో ముఖం మీద ఫౌండేషన్‌ను అప్లై చేయాలి. అంటే ముఖం మీద ఫౌండేషన్‌ చుక్కలుగా అద్ది, బ్రష్‌ లేదా స్పాంజ్‌తో ముఖాన్ని అద్దినట్టు చేస్తూ, ఫౌండేషన్‌ ముఖమంతా పరుచుకునేలా చేయాలి. తుడుస్తున్నట్టుగా అద్దితే, ఫౌండేషన్‌ ముఖానికి సమంగా అంటుకోదు. కాబట్టి స్టిప్లింగ్‌ టెక్నిక్‌ అనుసరించాలి.

మేపక్‌ సెట్టింగ్‌: ఫౌండేషన్‌ అప్లై చేసిన తర్వాత కొన్ని నిమిషాలు ఆగాలి. ఆ తర్వాత ప్రెస్‌డ్‌ లేదా లూజ్‌ పౌడర్‌ను అద్దుకోవాలి. ఈ మేకప్‌ లుక్‌ను సీల్‌ చేయడం కోసం ఫినిషింగ్‌ స్ర్పే కూడా వాడుకోవచ్చు. మొటిమల మచ్చలను దాచాలంటే: ఫేస్‌ ప్రైమర్‌తో మేకప్‌ మొదలుపెట్టాలి. తర్వాత ప్రైమర్‌, కన్‌సీలర్‌, అంతిమంగా ఫౌండేషన్‌, లూజ్‌ పౌడర్‌ వాడాలి. మచ్చలు నల్లగా లేదా ఎర్రగా ఉంటే, కలర్‌ కరెక్టర్‌ను వాడుకోవచ్చు.

Updated Date - Mar 31 , 2024 | 05:28 AM