అయొడిన్ లోపిస్తే?
ABN , Publish Date - Jan 29 , 2024 | 11:08 PM
థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తికి అయొడిన్ కీలకం. కాబట్టి ఈ పోషకం లోపిస్తే, మెటబాలిజం సమస్యలు వేధిస్తాయి. మన శరీరం స్వతఃసిద్ధంగా అయొడిన్‌ను తయారు చేసుకోలేదు కాబట్టి మనం ఆహారం ద్వారా సరిపడా అయొడిన్ శరీరానికి అందేలా చూసుకోవాలి.
థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తికి అయొడిన్ కీలకం. కాబట్టి ఈ పోషకం లోపిస్తే, మెటబాలిజం సమస్యలు వేధిస్తాయి. మన శరీరం స్వతఃసిద్ధంగా అయొడిన్‌ను తయారు చేసుకోలేదు కాబట్టి మనం ఆహారం ద్వారా సరిపడా అయొడిన్ శరీరానికి అందేలా చూసుకోవాలి. ఈ పోషకం లోపాన్ని ఈ లక్షణాల ద్వారా కనిపెట్టి వెంటనే సరిదిద్దుకోవాలి.
మలబద్ధకం: జీర్ణవ్యవస్థ పనితీరుకు థైరాయిడ్ గ్రంథి తగినంత హార్మోన్‌ను విడుదల చేయాలి. అయొడిన్ లోపంతో హార్మోన్ ఉత్పత్తి తగ్గడం మూలంగా మలబద్ధకం మొదలవుతుంది.
గుండె ఆరోగ్యం: అయొడిన్ తగ్గడం వల్ల గుండె కొట్టుకునే వేగం తగ్గుతుంది. దాంతో తల తిరగడం, నిస్సత్తువలు వేధిస్తాయి.
గర్భధారణ: అయొడిన్ లోపంతో థైరాయిడ్ హార్మోన్ స్రావం తగ్గడం వల్ల గర్భధారణ సాధ్యపడదు. అలాగే గర్భంలోని బిడ్డ నాడీసంబంధ ఎదుగుదలకు కూడా అయొడిన్ అవసరం. కాబట్టి గర్భం దాల్చాలనుకునే మహిళలు, గర్భిణులు థైరాయిడ్ హార్మోన్ సరిపడా ఉత్పత్తయ్యేలా ఆహారంలో అయొడిన్ ఉండేలా చూసుకోవాలి.
మెడ వాపు: అయొడిన్ లోపం ప్రధాన లక్షణం మెడ వాపు. థైరాయిడ్ గ్రంథి వాపు ద్వారా ఈ లోపం బయల్పడుతుంది.
డిప్రెషన్: మానసిక కుంగుబాటు, యాంగ్జయిటీలు కూడా అయొడిన్ లోపం లక్షణాలే!
ఆహారంతో: అయొడిన్ లోపాన్ని అయొడిన్ కలిగి ఉండే ఉప్పుతో సరిదిద్దుకోవచ్చు. హైపోథైరాయిడ్ జీవనశైలి సమస్య కాబట్టి వైద్యుల పర్యవేక్షణలో థైరాయిడ్ హార్మోన్‌ను మాత్రల రూపంలో తీసుకుంటూ ఉండాలి.