Share News

Anxiety : మత్తుతో చిత్తే!

ABN , Publish Date - Mar 18 , 2024 | 11:02 PM

రాత్రి మద్యం మత్తులో తూగేటప్పుడు పర్యవసనాల గురించి ఎవరూ ఆలోచించరు. మరుసటి ఉదయం నిద్ర లేచిన తర్వాత, హ్యాంగోవర్‌తో పాటు, అర్థం లేని ఆందోళన, భయాలు వేధిస్తాయి. ఈ ఆందోళనే ‘హ్యాంగ్జయిటీ’!

Anxiety : మత్తుతో చిత్తే!

రాత్రి మద్యం మత్తులో తూగేటప్పుడు పర్యవసనాల గురించి ఎవరూ ఆలోచించరు. మరుసటి ఉదయం నిద్ర లేచిన తర్వాత, హ్యాంగోవర్‌తో పాటు, అర్థం లేని ఆందోళన, భయాలు వేధిస్తాయి. ఈ ఆందోళనే ‘హ్యాంగ్జయిటీ’!

రాత్రి తాగిన మద్యం మత్తు తెల్లవారేసరికి పూర్తిగా దిగినా, దిగకపోయినా అపరాధభావన మాత్రం వేధించడం మొదలుపెడుతుంది. ఈ మానసిక స్థితికి కారణం వెనక భౌతిక వాస్తవాలున్నాయి. మద్యం తాగి, ఆ మత్తు నుంచి బయటపడే సమయంలో ప్రతి వ్యక్తి మెదడులో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. తక్కువ పరిమాణాల్లో మద్యం తీసుకున్న వాళ్లలో అయోమయం లాంటి లక్షణాలు కనిపిస్తే, ఎక్కువ మోతాదుల్లో తాగేసే వాళ్లలో మరుసటి ఉదయం ఆందోళన, భయం, మానసిక గందరగోళం లాంటి లక్షణాలు మొదలవుతాయి. బిడియాన్ని పోగొట్టి, ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసే మద్యం మరుసటి ఉదయానికి చిత్రమైన మానసిక అసంతులనానికి లోను చేస్తుంది. మెదడులోని న్యూరో ట్రాన్స్‌మీటర్లలో ఏర్పడే మార్పులే ఇందుకు ప్రధాన కారణం. ప్రధానంగా నిద్ర, ఒత్తిడులకు సంబంధించిన గామా అమీనోబ్యుటైరిక్‌ యాసిడ్‌ కేంద్ర నాడీ వ్యవస్థను ప్రశాంతంగా ఉంచుతుంది. మద్యంతో ఈ ట్రాన్స్‌మీటర్‌ మోతాదు తగ్గుతుంది. దీనికి తోడు మెదడులోని మరొక ట్రాన్స్‌మీటర్‌ గ్లూటామేట్‌ మీద కూడా మద్యం ప్రభావం పడుతుంది. ఈ గ్లూటామేట్‌ తగ్గడంతో, మెదడు మీద మద్యం ప్రభావం మరింత పెరిగి, ఆందోళనను ప్రేరేపించే రసాయనం ఉత్పత్తి పెరుగుతుంది. ఫలితంగా మద్యం తాగిన మరుసటి ఉదయం ఆందోళన, భయం మొదలవుతాయి. అరుదుగా తాగేవాళ్లలో హ్యాంగ్జయిటీ సమస్య ఒక్క రోజులోనే అదుపులోకి వచ్చేస్తుంది. కానీ క్రమం తప్పకుండా మద్యం తాగేవాళ్లలో ఈ న్యూరోట్రాన్స్‌మీటర్ల మధ్య సంతులనం దెబ్బతిని, హ్యాంగ్జయిటీ నుంచి కోలుకునే వేగం తగ్గుతుంది. ఏ లక్షణాలను కప్పి పుచ్చడం కోసం మద్యం తాగారో, మరుసటి రోజు అవే లక్షణాలు రెట్టింపు తీవ్రతతో విరుచుకుపడతాయి. హ్యాంగోవర్‌ నుంచి ఉపశమనం పొందడం కోసం కొందరు మరుసటి ఉదయం స్వల్పంగా మద్యం తీసుకునే పాతకాలపు చిట్కాను అనుసరిస్తూ ఉంటారు. ఈ రిలీఫ్‌ డ్రింకింగ్‌ వల్ల మరింత వ్యసనానికి దారి తీసే ప్రమాదం ఉంది.

Updated Date - Mar 18 , 2024 | 11:02 PM