Share News

దేశీ మార్కెట్లోకి నార్జో ‘70 సిరీస్‌’

ABN , Publish Date - Apr 27 , 2024 | 12:24 AM

రియల్‌మి నార్జో 70ఎక్స్‌, 70 సిరీస్‌ ఫోన్లు ఇండియన్‌ మార్కెట్లోకి వచ్చాయి. రెండు రంగుల్లో ఇవి అందుబాటులో ఉన్నాయి. ఆరంభ ధర రూ.12,000. 70ఎక్స్‌ సిరీస్‌ ఫోనుల్లో 6.72 ఇంచీల ఫుల్‌ హెచ్‌డీ, 45-120హెచ్‌జెడ్‌ రిఫ్రష్‌ రేటు, 950 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ కలిగి ఉన్నాయి.

దేశీ మార్కెట్లోకి  నార్జో ‘70 సిరీస్‌’

రియల్‌మి నార్జో 70ఎక్స్‌, 70 సిరీస్‌ ఫోన్లు ఇండియన్‌ మార్కెట్లోకి వచ్చాయి. రెండు రంగుల్లో ఇవి అందుబాటులో ఉన్నాయి. ఆరంభ ధర రూ.12,000. 70ఎక్స్‌ సిరీస్‌ ఫోనుల్లో 6.72 ఇంచీల ఫుల్‌ హెచ్‌డీ, 45-120హెచ్‌జెడ్‌ రిఫ్రష్‌ రేటు, 950 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ కలిగి ఉన్నాయి. ట్రిపుల్‌ స్లాట్‌(రెండు నానో సిమ్స్‌, ఒక మైక్రో ఎస్‌డీ కార్డు), సైడ్‌లో ఫింగర్‌ప్రింట్‌ సెన్సర్‌, 3.5 ఎంఎం ఆడియో జాక్‌ ఉన్నాయి. 6ఎన్‌ఎం మీడియాటెక్‌ 6100 + ఆక్టోకోర్‌ ప్రాసెసర్‌ ఉంది. స్టోరేజీని రెండు టీబీల మేరకు విస్తరించుకోవచ్చు. 45 వాట్స్‌ చార్జింగ్‌ స్పీడ్‌తో 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. 50ఎంపీ, 8 ఎంపీ రెండు కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీ, వీడియో కాలింగ్‌ కోసం 8ఎంపీ కెమెరా ఉపయోగపడుతుంది. 4జీబీ ర్యామ్‌, 128 స్టోరేజీ అయితే రూ.11,999; 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజీ అయితే రూ.13,4999కి లభిస్తాయి.

రియల్‌మి 70 5జీ విషయానికి వస్తే 6.7 ఇంచీల ఫుల్‌ హెచ్‌డీ, అమోల్డ్‌ స్ర్కీన్‌, 120హెచ్‌జెడ్‌ రిఫ్రష్‌రేటు 2000 నిట్స్‌ మేర పీక్‌ బ్రైట్‌నెస్‌ ఉన్నాయి. ఐపీ 54 డస్ట్‌ అలాగే వాటర్‌ రెసిస్టెంట్‌ రేటు కాగా దీనికి సైడ్‌లో ఫింగర్‌ప్రింట్‌ సెన్సర్‌, 3.5 ఎంఎం. ఆడియో జాక్‌ ఉన్నాయి. డ్యూయల్‌ స్లాట్‌(ఒకటి నానో సిమ్‌, ఇంకొకటి మైక్రో ఎస్‌డీ కార్డు) కోసం ఉన్నాయి. ఆండ్రాయిడ్‌ 14పై రన్‌ అయ్యే ఇవి 45వాట్స్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌ కేపబిలిటీతో 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. స్టోరేజీ 128జీబీ అయినప్పటికీ ర్యామ్‌ 6జీబీ అయితే రూ.15,999, 8జీబీ ర్యామ్‌ అయితే రూ.16,999కి లభిస్తాయి. మిస్టీ ఫారెస్ట్‌ గ్రీన్‌, స్నో మౌంటెయిన్‌ బ్లూ రంగుల్లో ఈ రెండు సిరీస్‌లకు చెందిన స్మార్ట్‌ ఫోన్లు లభ్యమవుతున్నాయి.

Updated Date - Apr 27 , 2024 | 12:24 AM