Share News

Sapota : వ్యాధి నిరోధక శక్తినిచ్చే...

ABN , Publish Date - Jun 12 , 2024 | 03:54 AM

విటమిన్లు, మినరల్స్‌ సపోటాలో పుష్కలం. ఓ రెండు సపోటాలు తింటే జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. దీనివల్ల పొట్ట సమస్యలు దరిచేరవు.

Sapota : వ్యాధి నిరోధక శక్తినిచ్చే...

  • విటమిన్లు, మినరల్స్‌ సపోటాలో పుష్కలం. ఓ రెండు సపోటాలు తింటే జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. దీనివల్ల పొట్ట సమస్యలు దరిచేరవు.

  • ఈ పండులో పీచుపదార్థం ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు పొటాషియం ఉండటం వల్ల రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది. గుండె సంబంధిత ఇబ్బందులు రాకుండా కాపాడుతుంది.

  • ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్‌ చర్మ సౌందర్యానికి మేలు చేస్తాయి. ముఖ్యంగా ఎ- విటమిన్‌ వల్ల చర్మం మీద మృతకణాలు తొలగిపోయిన వెంటనే కొత్త కణాలు వస్తాయి.

  • వంద గ్రాముల సపోటాలను తింటే అందులో 83 కేలరీలు అందుతాయి. ఇందువల్ల కడుపు నిండినట్లు ఉంటుంది. అనారోగ్యానికి గురిచేసే ఇతర ఆహారాన్ని తినాలనుకోరు. అందుకే బరువు తగ్గాలనుకునేవాళ్లకు సపోటా సపోర్టుగా పని చేస్తుంది. వారి మెనూలో సపోటాను చేర్చుకోవాల్సిందే.

  • కాల్షియం, పాస్ఫరస్‌ వల్ల ఎముకల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అంతేనా జుట్టు ఆరోగ్యానికి మంచిది.

  • ఇందులో చక్కెరశాతం ఉండటం వల్ల త్వరగా శక్తి వస్తుంది. ఈ చక్కెర శరీరానికి ఎలాంటి హాని చేయదు. ఇకపోతే ఎ, సి విటమిన్స్‌ వల్ల తెల్లరక్తకణాల వృద్ధికి దోహదపడతాయి. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి.

  • సపోటాలు తినటం వల్ల నిద్ర పడుతుంది. మెదడు మీద ప్రభావం చూపడటం వల్లనే నిద్రవస్తుంది. దీనివల్ల ఒత్తిడి తగ్గిపోతుంది.

  • డయాబెటిక్‌ బారిన పడినవాళ్లు ఈ సపోటాను ఎంచక్కా తినొచ్చు.

Updated Date - Jun 12 , 2024 | 03:54 AM