ఇమ్యూనిటీని పెంచే బెర్రీస్
ABN , Publish Date - Mar 03 , 2024 | 04:27 AM
చూడటానికి అందంగా, కలర్‌ఫుల్‌గా కనిపించే పండ్లు స్ర్టాబెర్రీస్. బెర్రీస్ అని పిలుస్తారు. న్రూటిన్ల పవర్ హౌస్ అయిన బెర్రీస్ వల్ల కలిగే ఉపయోగాలివి.
చూడటానికి అందంగా, కలర్‌ఫుల్‌గా కనిపించే పండ్లు స్ర్టాబెర్రీస్. బెర్రీస్ అని పిలుస్తారు. న్రూటిన్ల పవర్ హౌస్ అయిన బెర్రీస్ వల్ల కలిగే ఉపయోగాలివి.
హార్ట్‌షే్‌పలో ఉండే ఈ బెర్రీస్ తింటే గుండెకూ మంచిదే. రక్తప్రసరణ సాఫీగా ఉండేట్లు, ప్లేట్‌లేట్స్ సంఖ్య తగ్గకుండా కాపాడతాయి. రక్తపోటును అదుపులో ఉంటే గుణం వీటికి ఉంది. ఇందువల్ల గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయివి.
మధుమేహగ్రస్తులూ వీటిని తినొచ్చు. ఎలాంటి ఇబ్బంది కలిగించవు.
విటమిన్-సి ఉండే ఈ పండ్లను తరచుగా తినటం వల్ల క్యాన్సర్ కణాలు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
ముఖ్యంగా నారింజ కంటే ఎక్కువగా విటమిన్-సి కలిగి ఉండటం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. దీనివల్ల ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉండదు.
వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలం. మెదడులో ఉండే కణాలను ఫ్రీరాడికల్స్ బారిన పడకుండా కాపాడతాయివి. దీనివల్ల మెదడు ఆరోగ్యంగా ఉంటుంది.
నొప్పులు, ఆర్ధరైటిస్ లాంటి సమస్యలుంటే తగ్గిపోతాయి.