Share News

పెదవుల మీద పుండ్లు ఎందుకు?

ABN , Publish Date - Jan 18 , 2024 | 03:25 AM

డాక్టర్‌! గత కొన్ని రోజులుగా నా పెదవుల మీద పుండ్లు ఏర్పడి పైపూత మందులు వాడుతున్నా తగ్గడం లేదు. నాలుగు నెలల క్రితం సురక్షిత పద్ధతులు పాటించకుండా అపరిచిత వ్యక్తితో లైంగికంగా

పెదవుల మీద పుండ్లు ఎందుకు?

డాక్టర్‌! గత కొన్ని రోజులుగా నా పెదవుల మీద పుండ్లు ఏర్పడి పైపూత మందులు వాడుతున్నా తగ్గడం లేదు. నాలుగు నెలల క్రితం సురక్షిత పద్ధతులు పాటించకుండా అపరిచిత వ్యక్తితో లైంగికంగా కలిశాను. ఈ పుండ్లు ఏదైనా సుఖ వ్యాధికి సూచనలా?

- ఓ సోదరి, మిర్యాలగూడ

పెదవులు మీద పుండ్లు హెర్పిస్‌ వ్యాధి లక్షణం. హెర్పిస్‌ సింప్లెక్స్‌ వైరస్‌ సోకితే పెదవులు, ముఖం, ఛాతీ, వేళ్ల మీద పుండ్లు ఏర్పడతాయి. అలాగే జననావయవాల చుట్టూ నీటి బొబ్బలు కూడా తలెత్తుతాయి. ఈ వ్యాధిని త్వరగా గుర్తించి చికిత్స అందించకపోతే కళ్లు, మెదడు ఇన్‌ఫెక్షన్లకు లోనవుతాయి. హెర్పిస్‌ సింప్లెక్స్‌ వైర్‌సలలో రకాలు కూడా ఉన్నాయి. హెర్పిస్‌ సింప్లెక్స్‌ 1 అనే వైరస్‌ సోకితే, లక్షణాలు నడుము పై భాగంలో కనిపిస్తాయి. ఈ వైరస్‌ లైంగికంగా కలవకపోయినా, ముద్దులు పెట్టుకోవడం, వస్తువులను షేర్‌ కోసుకోవడం వల్ల కూడా ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది. హెర్పిస్‌ సింప్లెక్స్‌ 2 అనే వైరస్‌ లక్షణాలు నడుము కింది భాగంలో బయల్పడతాయి. ఈ వైరస్‌ లైంగిక కలయిక ద్వారానే సంక్రమిస్తుంది. కాబట్టి హెర్పిస్‌ ఉన్న వ్యక్తితో ఏ రకంగా సన్నిహితంగా మెలిగినా ఏదో ఒక హెర్పిస్‌ రకం వైరస్‌ కచ్చితంగా సోకుతుంది. హెర్పిస్‌ వ్యాధిని యాంటీవైరస్‌ మందులతో తగ్గించవచ్చు. కానీ ఈ వ్యాధిని సమూలంగా నిర్మూలించడం సాధ్యం కాదు. కాబట్టి వీలైనంత త్వరగా వైద్యులను సంప్రతించి వ్యాధి మరింత ముదిరిపోకుండా నియంత్రించుకోండి.

డాక్టర్‌ షర్మిలా మజుందార్‌,

సెక్సాలజిస్ట్‌ అండ్‌ సైకో అనలిస్ట్‌. హైదరాబాద్‌

Updated Date - Jan 18 , 2024 | 03:25 AM