Share News

Kitchen Tips: బియ్యం కడిగిన నీటిలో కోడిగుడ్లను ఉడకబెడితే.. ఈ చిట్కాలు పాటించి చూడండి..!

ABN , Publish Date - Mar 07 , 2024 | 04:29 PM

ఆకలి తీర్చే వంటగదిని తక్కని ఉపాయాలతో పని సులువు చేసుకోవచ్చు. ఉల్లిపాయ విషయానికే వస్తే ఉల్లిపాయను ముక్కలు చేయడానికి ముందు కొన్ని నిమిషాలు నానబెట్టడం, ఉల్లిలోని సమ్మేళనాలు తగ్గి కన్నీళ్లు లేకుండా చేస్తుంది.

Kitchen Tips: బియ్యం కడిగిన నీటిలో కోడిగుడ్లను ఉడకబెడితే.. ఈ చిట్కాలు పాటించి చూడండి..!
kitchen

ఉల్లిపాయను కోస్తే కళ్లలో నీళ్లు రాని వంటగదిని ఊహించుకుంటున్నారా..! చిన్న చిన్న చిట్కాలతో ఇలాంటి పెద్ద సమస్యలను కూడా దాటవచ్చు, ఆకలి తీర్చే వంటగదిని తక్కని ఉపాయాలతో పని సులువు చేసుకోవచ్చు. ఆకలి తీర్చే వంటగదిని తక్కని ఉపాయాలతో పని సులువు చేసుకోవచ్చు. ఉల్లిపాయ విషయానికే వస్తే ఉల్లిపాయను ముక్కలు చేయడానికి ముందు కొన్ని నిమిషాలు నానబెట్టడం, ఉల్లిలోని సమ్మేళనాలు తగ్గి కన్నీళ్లు లేకుండా చేస్తుంది.

వెల్లుల్లిని కత్తి, ఫ్లాట్ సైడ్ కింద పగులగొట్టడం వల్ల అప్రయత్నంగా తొక్కలు తీసేయవచ్చు. ఇది విలువైన సమయాన్ని ఆదా చేసే ఉపాయం. వెల్లుల్లి వాసన నుండి వేళ్లను కాపాడే సరళమైన పద్దతి వెల్లుల్లికి లవంగాలతో జత చేయడమే. వెల్లుల్లి వాసన పోయి చేతులు ఫ్రీ అవుతాయి. నీటిలో వెనిగర్ ఒక చుక్క వేస్తే చాలు గుడ్డు పచ్చసొనను లేతగా ఉడికేట్టు చేస్తుంది. ఇలాంటి చిట్కాలు ఎన్నో..!

1. పుదీనా పచ్చడి చేసేప్పుడు పెరుగు కలిపితే రుచిగా ఉంటుంది.

2. బియ్యం కడిగిన నీటిలో కోడిగుడ్లను ఉడకబెడితే పెంకులు సులువుగా వస్తాయి.

3. కూరల్లో పులుపు తక్కువగా ఉంటే మామిడి పొడితో కొంచెం పెరుగుకలిపి కూరలో వేస్తే టమోటా రుచి వస్తుంది.

4. వెక్కిళ్లు వస్తుంటే చల్లనీళ్లు తాగాలి. లేదా ఎక్కిళ్లు వచ్చే వ్యక్తి దృష్టిని మరల్చినా పోతాయి.

ఇది కూడా చదవండి: వేసవిలో మొక్కల పెరుగుదల బావుండాలంటే ఇలా చేయండి.. !

5. బ్రెడ్‌ ప్యాకెట్‌లో బంగాళదుంపలు ముక్కలు ఉంచితే బ్రెడ్‌ త్వరగా పాడవదు.

6. వంటింట్లో బొద్దింకల బెడద తగ్గిపోవాలంటే బోరిక్‌ పౌడర్‌ను మూలల్లో చల్లాలి.


7. కూరల్లో ఉప్పు ఎక్కువైతే కొబ్బరి ముక్క లేదా టమోటా ముక్కలు వేస్తే సరి.

ఇవి కూడా చదవండి:

నోటి ఆరోగ్యాన్ని పెంచే లవంగాలను గురించి తెలుసా..100 గ్రాముల లవంగాల్లో..!

ఆహారంతో పొటాషియం స్థాయిలను ఎలా పెంచాలి..!

యాపిల్ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసా..!

8. బౌల్స్‌, జ్యూస్‌ జార్స్‌లో వాసన వస్తోంటే ఉప్పులో కొద్దిగా నీళ్లుపోసి ఆ మిశ్రమాన్ని రుద్దాలి. ఆ తర్వాత ధారగా వచ్చే ట్యాప్‌ నీళ్లతో శుభ్రం చేయాలి.

9. ఫ్రిజ్‌లో పుదీనా ఆకులు ఉంచితే ఫ్రిజ్‌లో దుర్వాసన పోతుంది.

మరిన్ని వార్తల కోసం లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 07 , 2024 | 04:29 PM