Share News

వెయ్యి మంది డాన్సర్లతో హీరో ఇంట్రడక్షన్‌ సాంగ్‌

ABN , Publish Date - Mar 24 , 2024 | 03:10 AM

ఒక పాట చిత్రీకరణలో వెయ్యి మంది డాన్సర్లు పాల్గొనడం అంటే మాములు విషయం కాదు. అప్పుడెప్పుడో 1948 లో ‘చంద్రలేఖ’ చిత్రం కోసం జెమినీ వాసన్‌ దాదాపు ఐదు వందల మందితో డ్రమ్‌ డాన్స్‌ చిత్రీకరించి సంచలనం సృష్టించారు.

వెయ్యి మంది డాన్సర్లతో హీరో ఇంట్రడక్షన్‌ సాంగ్‌

ఒక పాట చిత్రీకరణలో వెయ్యి మంది డాన్సర్లు పాల్గొనడం అంటే మాములు విషయం కాదు. అప్పుడెప్పుడో 1948 లో ‘చంద్రలేఖ’ చిత్రం కోసం జెమినీ వాసన్‌ దాదాపు ఐదు వందల మందితో డ్రమ్‌ డాన్స్‌ చిత్రీకరించి సంచలనం సృష్టించారు. ఆ తర్వాత మళ్లీ అంత భారీ స్థాయిలో డాన్సర్లపై పాట చిత్రీకరించిన సందర్భాలు లేవనే చెప్పాలి. ‘భూల్‌ భూలయ్య 3’ హిందీ చిత్రంలో హీరో ఇంట్రడక్షన్‌ సాంగ్‌ కోసం ఇప్పుడు వెయ్యి మంది డాన్సర్లతో పాట చిత్రీకరించనున్నారనే వార్త బీ టౌన్‌లో వైరల్‌ అవుతోంది. హారర్‌, కామెడీ కథాంశంతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో కార్తీక్‌ ఆర్యన్‌ హీరోగా నటిస్తున్నారు. ముంబైలోని ఫిల్మ్‌ సిటీలో వేసిన భారీ సెట్‌లో ఈ పాటను చిత్రీకరించనున్నారు. నృత్య దర్శకుడు గణేశ్‌ ఆర్యన్‌ ఆధ్వర్యంలో వెయ్యి మంది డాన్సర్లు ప్రస్తుతం పాట చిత్రీకరణలో పాల్గొంటున్నారు. కార్తీక్‌ కూడా రెండు వారాలుగా ఈ పాట కోసం తయారువుతున్నారు. ‘బాలీవుడ్‌ చరిత్రలోనే భారీ స్థాయిలో పాటలను చిత్రీకరించిన చిత్రాలు కొన్ని ఉన్నాయి. వాటిలో ‘భూల్‌ భూలయ్య 3’ పాట కూడా ఒకటిగా నిలుస్తుంది. ఈ సినిమా ఒక విజువల్‌ ఫీస్ట్‌ అని చెప్పవచ్చు. హీరో కార్తీక్‌ కెరీర్‌లోనే ఇదొక అద్భుత చిత్రంగా నిలిచిపోతుంది’ అని యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. అనీస్‌ బజ్మీ దర్శకత్వంలో భూషణ్‌కుమార్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం దీపావళి సందర్భంగా విడుదలవుతుంది.

Updated Date - Mar 24 , 2024 | 03:10 AM