Share News

లవణ రహస్యం

ABN , Publish Date - Apr 30 , 2024 | 12:54 AM

ఖనిజ లవణాల పరిమాణం, ప్రాసెస్‌ ప్రక్రియల ఆధారంగానే లవణాన్ని ఆరోగ్యకరమైన లవణంగా పరిగణిస్తూ ఉంటారు. అయితే అన్ని రకాల లవణాల్లో సోడియం పరిమాణం సమానంగానే ఉన్నప్పటికీ కొన్నింటిలో ట్రేస్‌ మినరల్స్‌ అదనంగా ఉండడంతో పాటు, వాటిని ప్రాసెస్‌ చేసే ప్రక్రియ కూడా భిన్నంగా ఉంటుంది. కాబట్టి లవణాలు, రకాల గురించి తెలుసుకుందాం!

లవణ రహస్యం

నిజ లవణాల పరిమాణం, ప్రాసెస్‌ ప్రక్రియల ఆధారంగానే లవణాన్ని ఆరోగ్యకరమైన లవణంగా పరిగణిస్తూ ఉంటారు. అయితే అన్ని రకాల లవణాల్లో సోడియం పరిమాణం సమానంగానే ఉన్నప్పటికీ కొన్నింటిలో ట్రేస్‌ మినరల్స్‌ అదనంగా ఉండడంతో పాటు, వాటిని ప్రాసెస్‌ చేసే ప్రక్రియ కూడా భిన్నంగా ఉంటుంది. కాబట్టి లవణాలు, రకాల గురించి తెలుసుకుందాం!

హిమాలయన్‌ పింక్‌ సాల్ట్‌: లేత గులాబీ రంగులో ఉండే ఈ లవణంలో పొటాషియం, మెగ్నీషియం, క్యాల్షియం లాంటి ట్రేస్‌ మినరల్స్‌ కూడా ఉంటాయి. ఇవి పరిపూర్ణ ఆరోగ్యానికి తోడ్పడతాయి.

సీ సాల్ట్‌: సముద్రపు ఉప్పులో సముద్ర సంబంధ ఖనిజ లవణాలుంటాయి. కానీ దైనందిన వాడకం ద్వారా పింక్‌ సాల్ట్‌కు మించిన ఆరోగ్య ప్రయోజనాలు దీనితో పొందే అవకాశం ఉండదు.

పొటాషియం సాల్ట్‌: సాధారణ టేబుల్‌ సాల్ట్‌ కంటే పొటాషియం సాల్ట్‌లో 70ు తక్కువ సోడియం ఉంటుంది. పొటాషియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి హృద్రోగులకు ఈ ఉప్పు ఉపయోగకరం.

టేబుల్‌ సాల్ట్‌: సముద్రపు నీరు, ఉప్పు కయ్యల నుంచి తయారయ్యే టేబుల్‌ సాల్ట్‌ను తెల్లగా, జారుడుగా మార్చడం కోసం దాన్లోని మలినాలను తొలగించి, యాంటీ కేకింగ్‌ ఏజెంట్లను జోడిస్తారు. అయొడిన్‌ లోటును భర్తీ చేయడం కోసం అయొడిన్‌ను కూడా జోడిస్తారు.

ఏ ఉప్పు తీసుకున్నా దాన్లో ఉండే సోడియం మోతాదు ఒకేలా ఉంటుంది కాబట్టి ఉప్పును వీలైనంత పరిమితంగా వాడుకోవాలి.

Updated Date - Apr 30 , 2024 | 12:59 AM