Share News

Technology : గూగుల్‌ సెర్చ్‌ పవర్‌ పెంపు

ABN , Publish Date - May 18 , 2024 | 01:08 AM

గూగుల్‌ తాజాగా ఏఐ పవర్డ్‌ సెర్చ్‌ ఫీచర్‌ను ఆరంభించింది. ఫలితంగా జవాబులు త్వరితగతిన పొందొచ్చు. అదే సమయంలో ఆర్గనైజ్డ్‌(పద్ధతిగా) ఫలితాలను అందుకోవచ్చు.

Technology : గూగుల్‌ సెర్చ్‌  పవర్‌ పెంపు

గూగుల్‌ తాజాగా ఏఐ పవర్డ్‌ సెర్చ్‌ ఫీచర్‌ను ఆరంభించింది. ఫలితంగా జవాబులు త్వరితగతిన పొందొచ్చు. అదే సమయంలో ఆర్గనైజ్డ్‌(పద్ధతిగా) ఫలితాలను అందుకోవచ్చు. దీన్నే సెర్చ్‌ జనరేటివ్‌ ఎక్స్‌పీరియెన్స్‌ అంటోంది.

యూజర్లు అందరికీ ఏఐ పవర్డ్‌ ‘ఓవర్‌వ్యూస్‌’పేరుతో దీన్ని గూగుల్‌ తీసుకు వచ్చింది. గత ఏడాదే ఆరంభించినప్పటికీ ఇన్నాళ్ళు ఇది టెస్టింగ్‌లోనే ఉంది. ఇప్పుడు అమెరికాలో ఇది డిఫాల్ట్‌ ఫీచర్‌గా అందుబాటులోకి వచ్చింది.

దీన్ని త్వరలోనే విస్తరించనున్నారు. ఈ నేపథ్యంలోనే వెబ్‌సైట్‌ ట్రాఫిక్‌ చర్చల్లోకి వచ్చింది. రాబోయే సంవత్సరాల్లో పాతిక శాతం మేర నష్టం వస్తుందని కూడా భావిస్తున్నారు. అయినప్పటికీ గూగుల్‌ తన కమిట్‌మెంట్‌కే నిబద్ధం కావాలని అనుకున్నట్టు సమాచారం.

Updated Date - May 18 , 2024 | 01:09 AM