Share News

Fruits : పండ్లు పరిమితంగానే...

ABN , Publish Date - Dec 10 , 2024 | 12:39 AM

బరువు తగ్గడం కోసం కొంతమంది పూర్తిగా పండ్ల మీదే ఆధారపడుతూ ఉంటారు. కానీ ఫలాహారం ఆరోగ్యకరం కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Fruits : పండ్లు పరిమితంగానే...

బరువు తగ్గడం కోసం కొంతమంది పూర్తిగా పండ్ల మీదే ఆధారపడుతూ ఉంటారు. కానీ ఫలాహారం ఆరోగ్యకరం కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

సమతులాహారంలో భాగంగా తరచూ పండ్లు తింటూ ఉండడం కచ్చితంగా ఆరోగ్యకరమే! అయితే ఆ అలవాటులో భాగంగా అవసరానికి మించి పండ్లు తింటున్నామా? అని ఎవరైనా, ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకంటే... ‘అతి అనర్థదాయకం’ అంటారు. ఈ సూత్రం పండ్లకూ వర్తిస్తుంది. అతిగా పండ్లు తినడం వల్ల ఒరిగే ప్రభావం ప్రత్యేకించి కాలేయానికి ప్రతికూలంగా ఉంటుంది. ఎక్కువ కాలం పాటు అధిక మోతాదుల్లోని ఫ్రక్టోజ్‌ కాలేయానికి చేరినప్పుడు, కాలేయం ఆ అదనపు ఫ్రక్టోజ్‌ను కొవ్వుగా మార్చుకుంటుంది. ఫలితంగా ఆ పరిస్థితి, నాన్‌ఆల్కహాలిక్‌ ఫ్యాటీ లివర్‌ డిసీజ్‌కు దారి తీస్తుంది. అదనంగా పండ్లు తినడం వల్ల, కడుపుబ్బరం, డయేరియా లాంటి తాత్కాలిక సమస్యలు కూడా తలెత్తే అవకాశాలుంటాయి. అలాగే పండ్లలోని సహజసిద్ధ ఆమ్లాలు, చక్కెరల వల్ల దంతక్షయం ప్రమాదం ఉంటుంది. అలాగే రక్తంలో చక్కెర మోతాదులు హెచ్చుతగ్గులకు గురవుతాయి కాబట్టి మధుమేహులు, హైపర్‌గ్లైసీమియా లేదా క్లోమ సమస్యలు ఉన్నవాళ్లు పండ్లు వీలైనంత పరిమితంగా తీసుకోవాలి.

Updated Date - Dec 10 , 2024 | 12:39 AM