Share News

పూర్వ జన్మ ఫలం

ABN , Publish Date - Oct 25 , 2024 | 12:53 AM

పురాకృత కర్మ ఫలం ఎంత విశిష్టమైనదో తన నీతిశతకంలోని... భీమం వనం భవతి తస్య పురం ప్రధానం సర్వో జనః సుజనతా ముపయాతి తస్య

పూర్వ జన్మ ఫలం

పురాకృత కర్మ ఫలం ఎంత విశిష్టమైనదో తన నీతిశతకంలోని...

భీమం వనం భవతి తస్య పురం ప్రధానం

సర్వో జనః సుజనతా ముపయాతి తస్య

కృత్స్నా చ భూర్భవతి సన్నిధి రత్నపూర్ణా

యస్యాస్తి పూర్వ సుకృతం విపులం నరస్య అనే శ్లోకంలో భర్తృహరి వివరించాడు.

భువనమున బూర్వ సంభృత పుణ్యరాశి

యగుచు నుదయంబు గాంచిన సుగుణ నిధికి

వనము పురమగు బరులాత్మ జనములగుదు

రవని నిధిరత్న పరిపూర్ణ య్యి ఫలించు అంటూ దాన్ని తెలుగువారికి అందించాడు ఏనుగు లక్ష్మణకవి.

భావం: పూర్వ జన్మలో చేసిన పుణ్యం మానవుణ్ణి పెన్నిధిలా కాపాడుతుంది. ఏనుగులు, పులులు, సింహాలు లాంటి భీకరమైన మృగాలతో నిండి ఉన్న కీకారణ్యం అతనికి సకల సౌకర్యాలతో నిండిన మహా నగరంలా మారుతుంది. శత్రువులు వారి విరోధాన్ని విడిచి స్నేహితులు అవుతారు. వారికి తామం ఉన్న చోటు సకల సంపదలతో... రత్నగర్భగా మారుతుంది. మరుసటి జన్మల్లో అటువంటి ఫలితాలు పొందాలంటే... ఈ జన్మలో ఎల్లప్పుడూ మంచి పనులు చేయాలి.

Updated Date - Oct 25 , 2024 | 12:54 AM