Share News

Friendship : సత్పురుషుల స్నేహం

ABN , Publish Date - Aug 02 , 2024 | 04:06 AM

క్షీరేణాత్మగతో దకాయహి గుణా దత్తాఃపురాతేఖిలాః క్షీరోత్నాపమపేక్ష్య తేన పయసాస్వాత్మా కృశానో హుతః గన్తుం పావక మున్మన స్తదభవ ద్దృష్ట్వాతు మిత్రాపదం

Friendship : సత్పురుషుల స్నేహం

క్షీరేణాత్మగతో దకాయహి గుణా దత్తాఃపురాతేఖిలాః

క్షీరోత్నాపమపేక్ష్య తేన పయసాస్వాత్మా కృశానో హుతః

గన్తుం పావక మున్మన స్తదభవ ద్దృష్ట్వాతు మిత్రాపదం

యుక్తం తేన జలేన శామ్యతి సతాం మైత్రి పునాస్త్వీదృశీ... అనే ఈ శ్లోకంలో మంచివారితో చెలిమి గురించి తన నీతిశతకంలో భర్తృహరి వివరించాడు. దాన్ని...

క్షీరము మున్ను నీటికొసగెన్‌ స్వగుణంబులు

దన్నుజేరుటన్‌ క్షీరముతప్తమౌట గని చిచ్చురికెన్‌ వెతచే జలంబు, దు

ర్వార సుహుద్విపత్తిగని వహ్ని జొరం జనె దుగ్ధమంతలో

నీరముగూడి శాంతమగు నిల్చు మహాత్ముల మైత్రి యీగతిన్‌... అనే పద్య రూపంలో ఏనుగు లక్ష్మణకవి తెలుగులోకి అనువదించాడు.

భావం: పాలలో నీరు కలిసినప్పుడు... తన తెల్లదనాన్ని, తియ్యదనాన్ని నీటికి ఇచ్చి... నీటితో పాలు మైత్రి చేసుకుంటాయి. పాలను కాచుతున్నప్పుడు... పాలు మరిగిపోవడాన్ని సహించలేక... నీరు పైకి లేచి ఆవిరైపోతుంది. తనను స్నేహితుడు విడిచి వెళ్ళిపోతున్నాడనే వేదనతో... పాలు పొంగి మంటల్లో పడిపోవడానికి ప్రయత్నిస్తాయి. అప్పుడు పాల మీద నీరు పడితే (చల్లితే)... తనను మిత్రుడు మళ్ళీ కలిశాడన్న సంతోషంతో పాలు ఊరట పొంది వెనక్కు తగ్గుతాయి. మహాత్ములతో స్నేహం కూడా ఈ విధంగానే ఉంటుంది. మిత్రులకు కష్టం వచ్చినప్పుడు, దూరమైనప్పుడు తల్లడిల్లుతారు. వారు తిరిగి తమను చేరుకున్నప్పుడు సంతోషపడతారు.

Updated Date - Aug 02 , 2024 | 04:06 AM