Share News

Period Pain: పీరియడ్స్ సమయంలో ఇవి తింటే చాలు.. పెయిన్ కిల్లర్స్ కూడా అవసరం లేదు..

ABN , Publish Date - Nov 14 , 2024 | 09:15 AM

మహిళలు నెలసరి సమయంలో నొప్పిని భరించలేక పెయిన్ కిల్లర్స్ వాడుతారు. కానీ, అది ఏ మాత్రం కరెక్ట్ కాదని.. ఆ సమయంలో కొన్ని ఆహార పదార్ధాలు తీసుకుంటే నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం..

Period Pain: పీరియడ్స్ సమయంలో ఇవి తింటే చాలు.. పెయిన్ కిల్లర్స్ కూడా అవసరం లేదు..
Period Pain

Period Pain: కొంతమంది మహిళలకు పీరియడ్స్ అంటే చాలా పెద్ద సమస్య. ఆ మూడు రోజులు చికాకుగా, ఆలసటగా, అసహనంగా ఉంటారు. విపరీతమైన కడుపు నొప్పి వస్తుంది. కొంతమంది ఈ నొప్పిని భరించలేక మంచానికి అతుక్కుపోతూంటారు. మహిళల్లో 30 నుంచి 50 శాతం మంది వరకూ ఈ పీరియడ్స్ పెయిన్ బాధాకరంగా ఉంటుంది. ఈ నొప్పి వాళ్ల వ్యక్తిగత, ఆఫీస్ లైఫ్‌పై ఎఫెక్ట్ చూపుతుంది. కొంతమంది అమ్మాయిలు నెలసరి సమయంలో నొప్పి భరించలేక పెయిన్ కిల్లర్స్ వాడుతారు. అయితే, ఇవి ఎక్కువగా వాడితే.. పీరియడ్ సైకిల్, ఒవ్యూలేషన్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలా కాకుండా కొన్ని ఆహార పదార్ధాలు తీసుకుంటే నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం..

1. కమలా పండ్లు..

కమలా పండు నెలసరి నొప్పి తగ్గించే బెస్ట్ ఫుడ్స్‌లో ఒకటి. ఆరెంజ్, నిమ్మకాయల కంటే విటమిన్ సి కంటెంట్ ఈ పండులో ఎక్కువగా ఉంటుంది. దీనిలో మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ డి కూడా ఉంటాయి. కమలా పండులోని యాంటీ ఇన్ఫ్లమేషన్ గుణాలు పీరియడ్ పెయిన్స్ తగ్గించడానికి సహాయపడతాయి. మీరు నెలసరి నొప్పితో బాధపడుతుంటే.. మీ డైట్ ప్లాన్ లో కమలా పండ్లు ఎక్కువగా తీసుకోండి.

2. నిమ్మరసం:

నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఆహారం నుంచి ఐరన్‌ను రక్తప్రవాహంలోకి, కణజాలాలలోక బాగా గ్రహించేలా చేస్తుంది. నిమ్మకాయలో ఫైబర్ అధికంగా ఉంటుంది కాబట్టి ఇది కండరాల నొప్పిని తగ్గిస్తుంది. అంతేకాకుండా నిమ్మకాయలో ఉన్న విటమిన్ సీ.. ఐరన్ శోషణను పెంచడానికి సహాయపడుతుంది.

3. డ్రై ఫ్రూట్స్, నట్స్..

మహిళలు నల్ల ఎండుద్రాక్ష, జీడిపప్పు, బాదం వంటి డ్రైఫ్రూట్స్ వారి డైట్‌లో తీసుకుంటే చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. నల్ల ఎండుద్రాక్ష‌లో .. ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. జీడిపప్పులో టోకోఫెరోల్ ఉంటుంది. ఇది పీరియడ్ సైకిల్‌ను నియంత్రిస్తుంది.

4. ఆకుకూరలు..

ఆకుకూరల్లో ఐరన్, మెగ్నీషియం, కాల్షయం అధికంగా ఉంటుంది. ఈ పోషకాలు శరీరానికి శక్తిని అందించడానికి సహాయపడతాయి. ఇవి జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి. అలసటను దూరం చేస్తాయి. పీరియడ్స్ నొప్పిని తగ్గిస్తాయి.

5. దాల్చిన చెక్క..

దాల్చిన చెక్కలో యాంటీ స్పాస్మోడిక్ గుణాలు మెండుగా ఉంటాయి. ఇవి నెలసరి సమయంలో నొప్పిని తగ్గించడానికి సహాయపడతాయి. దాల్చిన చెక్క నెలసరి సమయంలో అసౌకర్యం, పీరియడ్స్ సమయంలో హై బ్లీడింగ్, వికారం, వాంతులు వంటి డిస్మెనోరియా లక్షణాలు తగ్గించడానికి సహాయపడుతుంది. నెలసరి నొప్పులతో బాధపడేవారు దాల్చిన చెక్క టీ తాగితే రిలీఫ్ లభిస్తుంది.

6. హాట్ చక్లెట్..

నెలసరి సమయంలో నొప్పిని తగ్గించడానికి హాట్ చాక్లెట్ సహాయపడుతుంది. ఇది మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. డార్క్ చాక్లెట్‌లో ఐరన్, మెగ్నీషయం ఉంటుంది. ఇది మీ శరీరానికి శక్తినిస్తుంది. మీ పీరియడ్స్ సమయంలో ఒక కప్పు హాట్ చాక్లెట్ తీసుకుంటే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

7. అల్లం..

అల్లం రుతుక్రమంలో వచ్చే నొప్పులను తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. అల్లం అసౌకర్యాన్ని కలిగించే ప్రోస్టాగ్లాండిన్స్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఇది క్రమం తప్పిన పీరియడ్స్ ను రెగ్యులర్ చేస్తుంది. ప్రీమెన్‌స్ట్రువల్ కారణంగా వచ్చే అసౌకర్యాన్ని తగ్గిస్తుంది.

(Note: ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమం.)

Updated Date - Nov 14 , 2024 | 09:15 AM