Share News

Friendship: ఇలాంటి వారితో ఫ్రెండ్‌షిప్ చేస్తున్నారా.. వెంటనే వారిని వదిలేయండి..

ABN , Publish Date - Nov 08 , 2024 | 01:57 PM

ఈ మధ్య కాలంలో స్నేహం కోసం త్యాగాలు చేసేవారి కన్నా.. నమ్మించి గొంతు కోసే స్నేహితులే ఎక్కువగా ఉన్నారు. అలాంటి వారితో మీరు ఫ్రెండ్‌షిప్ చేస్తున్నారా.. వెంటనే వారిని గుర్తించి వదిలేయండి.

Friendship: ఇలాంటి వారితో ఫ్రెండ్‌షిప్ చేస్తున్నారా.. వెంటనే వారిని వదిలేయండి..
Friendship

Friendship: అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు, అన్న ఇలా ఏ బంధాన్ని అయినా దేవుడే ఇస్తాడు.. కానీ స్నేహం అనే బంధాన్ని మాత్రం మనమే వెతుక్కోవాలి అని ఓ సినిమా డైలాగ్ ఉంది. మన జీవితంలో చదువుకునే సమయం దగ్గర నుంచి ఉద్యోగాలు చేసే సమయం వరకు చాలా మంది పరిచయమవుతారు. అలా పరిచయమైన వారిలో కేవలం కొందరు మాత్రమే మంచి స్నేహితులుగా మిగిలిపోతారు.

మన బాధల్లో, సంతోషంలో ఎల్లప్పుడూ తోడుగా ఉంటారు. ఏ కష్టం వచ్చినా మన కష్టాలను వారి కష్టాలుగా భావిస్తారు. వీలైనంత సహాయం చేయడానికి ఎప్పుడు ముందుంటారు. మనం ఎదిగినా, నాశనమై పోయినా దాని వెనుక కచ్చితంగా స్నేహితులు ఉంటారని అంటారు. అయితే, స్నేహితుల కోసం త్యాగాలు చేసేవారు ఉంటారు. నమ్మించి గొంతుకోసే స్నేహితులూ ఉంటారు. గొంతుకోసే వారితో మీరు ఫ్రెండ్‌షిప్ చేస్తున్నారా.. ఈ లక్షణాలు మీ ఫ్రెండ్స్ లో ఉంటే వెంటనే వారిని గుర్తించి ఫ్రెండ్‌షిప్ కట్ చేయండి.


1. చెడు అలవాట్లు..

మద్యం, సిగరెట్, అప్పులు, బెట్టింగులు ఇలాంటి చెడు అలవాట్లు ఉన్న ఫ్రెండ్స్‌తో దూరంగా ఉండండి. ఎందుకంటే స్నేహం పేరుతో మిమ్మల్ని మార్చేస్తారు. ఇలాంటి వారితో ఫ్రెండ్‌షిప్ చేసి ఇబ్బందులు తెచ్చుకునే కంటే అలాంటి వారితో ఫ్రెండ్‌షిప్ కట్ చేయండి.

2. అవసరానికి..

అవసరానికి మాత్రమే మీతో ఫ్రెండ్‌షిప్ చేసేవారు మీకు అవసరం లేదు. వారి పనుల కోసం మీరు వెళ్లినా మీ అవసరానికి వారు ముందుకు రారు. అప్పుడు మీరు బాధపడేకన్నా ముందుగానే వారు మీ విషయంలో ఎలా ఉంటున్నారో గ్రహించండి.

3. డబ్బు..

కొంతమంది కేవలం డబ్బు కోసం మాత్రమే మీతో స్నేహం చేయవచ్చు. అలాంటి వారికి దూరంగా ఉండటం ఉత్తమం. డబ్బు కోసం మీపై ప్రేమను నటిస్తారు. డబ్బు లేనప్పుడు మిమ్మల్ని వారు వదిలి వెళ్లిపోతారు.

4. ఎగతాళి..

ఎగతాళి చేసే స్నేహితులకు దూరంగా ఉండటం బెటర్. ఎందుకంటే మీ వ్యక్తిగత సమస్యలను, విషయాలను వారు ఇతరులకు చెప్పి మిమ్మల్ని బాధపెటవచ్చు. అంతేకాకుండా అందరిలో మిమ్మల్ని ఎగితాలి చేస్తారు.

5. క్షమించే గుణం..

మనిషి పొరపాట్లు చేయడం సహజం. ఒక్కొక్కసారి మనం తెలియకుండా చిన్న చిన్న తప్పులు చేసే అవకాశం ఉంది. అయితే, ఆ తప్పులను కూడా క్షమించే మనసు ఉన్నవారితో మాత్రమే ఫ్రెండ్‌షిప్ చేయండి. అంతేకానీ, చిన్న విషయాలకే గొడవ పడి దూరం పెట్టేవారితో స్నేహం ఏ మాత్రం మంచిది కాదు.

6. నమ్మకం..

కొంతమంది ఎన్నో ఏళ్లుగా మీతో ఫ్రెండ్‌షిప్ చేస్తున్నప్పటికి వారు మిమ్మల్ని నమ్మకండా ఉంటారు. అలాంటి వారితో స్నేహం కరెక్ట్ కాదు. అలాంటి వారు మీ స్నేహితులుగా ఉంటే వారిని వదిలేయండి.

Updated Date - Nov 08 , 2024 | 02:05 PM