క్రోమ్ ఓఎస్ 124 అప్డేట్
ABN , Publish Date - May 11 , 2024 | 02:34 AM
క్రోమ్ ఓఎస్ 124 అప్డేట్‌తో క్రోమ్‌బుక్‌కు ఫాస్టర్ స్ప్లిట్ స్ర్కీన్ సెటప్‌నకు తోడు పలు ఫీచర్లను తీసుకొచ్చింది
క్రోమ్ ఓఎస్ 124 అప్డేట్‌తో క్రోమ్‌బుక్‌కు ఫాస్టర్ స్ప్లిట్ స్ర్కీన్ సెటప్‌నకు తోడు పలు ఫీచర్లను తీసుకొచ్చింది. క్రోమ్‌బుక్ యూజర్ల కోసం గూగుల్ విడుదల చేసింది. ముందే పేర్కొన్నట్టు ఇందులో మొదటిది పాస్టర్ స్ప్లిట్ స్ర్కీన్ సెటప్ ఫీచర్.
విండో లేఔట్‌ని చాలా వేగంగా చేయవచ్చు. ఓపెన్ అయిన విండోలను ఒక సైడ్ నుంచి చూడవచ్చు. వైఫైకి ప్రాధాన్యం ఇచ్చింది. వీడియె కాన్ఫరెన్సింగ్, గేమింగ్ అప్లికేషన్స్‌కు అనువుగా మార్చింది.
దాంతో వీడియో ప్లేయింగ్ చాలా సాఫీగా ఉంటుంది. మైస్ కోసం ఫాస్ట్ పెయిర్ ఫీచర్ మరొకటి. క్రోమ్ ఓఎస్ డివైజ్‌కు సానుకూలమైన మౌస్‌గా ఉంటుంది. కర్సర్ సైజ్‌ను అడ్జస్ట్ చేసుకోవచ్చు.